Begin typing your search above and press return to search.
ఈ సంక్రాంతి ఆ టెక్నీషియన్ సొంతం
By: Tupaki Desk | 16 Jan 2017 7:01 AM GMTసంక్రాంతి కానుకగా విడుదలైన రెండు భారీ సినిమాలు మంచి విజయం సాధించడంతో అటు అభిమానులకు ఇటు పంపిణీదారులకు ఈ పండుగ కనుల నిండుగా గడిచింది. ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి.. ఈ రెండింటికీ పని చేసిన ప్రతీఒక్కరూ ఆయా చిత్రంలో తమకు పనిచేసే అవకాశం రావడం తమ అదృష్టమని పొంగిపోతున్నారు. అయితే ఒక టెక్నీషియన్కి మాత్రం ఈ పండుగ నిజంగా మరుపురాని పండుగే. అతనే రచయిత సాయి మాధవ్ బుర్రా.
శాతకర్ణి సినిమాకి తెలుగువాడి వాడివేడిని మాటల పదును రూపంలో అందించిన సాయి మాధవ్ అందరి మన్ననలను అందుకుంటున్నాడు. అయితే చిరంజీవి కమ్ బ్యాక్ ఫిల్మ్ లో సైతం సాయి పెన్ను పాత్ర బేషుగ్గా కనిపిస్తుంది. ఈ సినిమాలో మనల్ని కదిలించిన రైతన్న ఆకలి ఘోషలు, వారి కష్టాల గురించి చిరు చెప్పే డైలాగులు నేరుగా గుండెల్ని తాకుతున్నాయి.
రెండు సినిమాలలో తన రచనా ప్రతిభతో మెప్పించిన సాయి మాధవ్ బుర్రా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మంచి రచయిత నుండి మోస్ట్ వాంటెడ్ రైటర్ గా మారడంలో ఈ సంక్రాంతి అతనికి బానే సాయపడింది. తెలుగు కళామతల్లి మురిసిపోయే మధుర సంభాషణలు మరిన్ని రాయాలని కోరుకుందాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/