Begin typing your search above and press return to search.
సోనూ సూద్ తర్వాత ఈ సౌత్ స్టార్ బెటర్
By: Tupaki Desk | 23 Aug 2020 5:45 AM GMTకోవిడ్ మహమ్మారీ జీవితాల్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా సినీపరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఐదారు నెలలుగా షూటింగుల్లేవ్.. థియేట్రికల్ రిలీజ్ లు లేవు. మనుగడ కోసం సినీకార్మికులు తీవ్రంగా పోరాడాల్సిన ధైన్యం నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో సినీహీరోల స్పందన అద్భుతం. పలువురు స్టార్లు సినీకార్మికులను ఆదుకునేందుకు అంతో ఇంతో సాయం చేస్తున్నారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సీసీసీ చారిటీని ప్రారంభించి కార్మికులకు నిత్యావసరాల్ని సరఫరా చేసి ఆదుకుంటున్నారు. పలువురు తెలుగు హీరోలు విరివిగా విరాళాలు ఇచ్చారు. కొందరైతే నిత్యావసరాల్ని పంచారు. వీళ్లందరినీ మించి లాక్ డౌన్ సమయంలో పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికుల్ని నటుడు సోనూసూద్ ఆదుకున్న సంగతి తెలిసిందే. కష్టకాలంలో అతడి చొరవ సాయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన సాయం చేసిన రియల్ హీరోగా దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది.
ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య వంతు. ఆయన కూడా సోనూ సూద్ తరహాలోనే ధాతృత్వం చూపించారు. ఉపాధి లేక బతుకు తెరువుకు కష్టమై ఇబ్బందుల్లో ఉన్న సినీకార్మికుల్ని ఆదుకునేందుకు తన వంతుగా రూ.5కోట్ల విరాళం ఇచ్చారు. కష్టకాలంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటూ తనకు అండగా నిలిచినందుకు కార్మికులకు ఇది నా సాయం అని సూర్య ప్రకటించారు. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా త్వరలో ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.