Begin typing your search above and press return to search.

వాళ్లతో నటించక పోవడం వల్లే నాకు ఈ స్టార్‌ డం

By:  Tupaki Desk   |   1 April 2022 3:16 PM GMT
వాళ్లతో నటించక పోవడం వల్లే నాకు ఈ స్టార్‌ డం
X
బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి మీడియా ముందుకు వచ్చింది. ఆమె సోషల్‌ మీడియాలో అయినా.. మీడియా ముందుకు వచ్చినా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదంటే స్టార్స్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం చేస్తూనే ఉంటుంది. ఆమె వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో పాటు చర్చనీయాంశంగా మారుతాయి అనడంలో సందేహం లేదు.

ఇక తాజాగా ఆమె నటించిన 'ధాకడ్‌' సినిమా ట్రైలర్‌ విడుదల అయ్యింది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ సినీ వర్గాల వారు మరియు ఆమె అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న కంగనా రనౌత్‌ మరోసారి ఈ సినిమా తో సక్సెస్‌ ను దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా నమ్మకంతో ఉంది.

తాజాగా ధాకడ్‌ సినిమా ట్రైలర్‌ విడుదల సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. కెరీర్‌ ఆరంభంలో తాను స్టార్‌ హీరోల సినిమా ల్లో నటించక పోవడం వల్లే ప్రస్తుతం ఈ స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. కెరీర్‌ ఆరంభంలో తనకు ఖాన్.. కుమార్ వంటి బడా స్టార్స్‌ హీరోల నుండి ఆఫర్లు వచ్చాయి. కాని వాటిని నేను తిరష్కరించాను.

ఆ బడా హీరోల సినిమా లను తిరష్కరించిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను అవహేళన చేసినట్లుగా మాట్లాడారు. అంత పెద్ద స్టార్‌ హీరోల సినిమాలకు నో చెప్పిన నువ్వు ఇండస్ట్రీలో ఎలా కొనసాగుతావు అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా చాలా మంది నన్ను త్వరలోనే ఇండస్ట్రీ లో కనుమరుగవుతావు అంటూ హెచ్చరించారు. వారందరు ఇప్పుడు నోరు వెళ్లబెట్టి చూస్తున్నారు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.

అప్పుడు నేను హీరో సెంట్రిక్‌ సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఈ స్థాయికి వచ్చే దాన్ని కాదు.. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే.. ఇంత గా నాకు గుర్తింపు వచ్చి.. ఇన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేశాను అంటే కేవలం ఆ సినిమాలను కాదనడమే అంటూ కంగనా చెప్పుకొచ్చింది. భవిష్యత్తు పరిణామాల దృష్ట్యా నేను అప్పుడు సినిమాలు ఒప్పుకోలేదు అని ఇప్పుడు చాలా మందికి అర్థం అయ్యిందన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేసింది.

కంగనా వ్యాఖ్యలకు స్టార్‌ హీరోల అభిమానులు మరియు మీడియా వర్గాల వారు ఎప్పటిలాగే కౌంటర్ ఇస్తున్నారు. స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్స్ స్టార్‌ హీరోయిన్స్‌ కాలేదా అంటూ ప్రశ్నించారు. ప్రియాంక చోప్రా... కరీనా కపూర్ వంటి స్టార్ హీరోయిన్స్ కెరీర్ ఆరంభంలో స్టార్‌ హీరోలతో నటించారు. వారు ఇప్పుడు ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ స్టార్స్ అయ్యారు కదా అంటూ కొందరు కంగనాను ప్రశ్నిస్తున్నారు. మరి కంగనా వారికి ఏం సమాధానం చెబుతుందో చూడాలి.