Begin typing your search above and press return to search.
ఈ వేసవి వినోదం టాలీవుడ్ నుంచి గట్టిగానే
By: Tupaki Desk | 3 Feb 2023 5:00 PM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోలు కథల ఎంపిక విధానం పూర్తిగా మారుతుంది అని చెప్పాలి. ఒకప్పుడు నేటివిటీ టచ్ తో కేవలం తెలుగుకి మాత్రమే పరితమయ్యే కథల్ని ఎంపిక చేసుకునేవారు. అలాగే ఎక్కువగా కమర్షియల్ జోనర్ లోనే టాలీవుడ్ హీరోలు అందరూ కూడా సినిమాలు చేస్తూ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందిస్తూ ఉండేవారు. ఈ కారణంగానే తెలుగు సినిమాలు జాతి స్థాయిలో నేషనల్ అవార్డులు అందుకున్న పరిస్థితి పెద్దగా ఉండేది కాదు.
అయితే మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా పూర్తిగా మారిందని చెప్పాలి. డిజిటల్ మాధ్యమాల ద్వారా వరల్డ్ లో ఇతర భాష చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూడగలుగుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కొత్తదనం కోరుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులు కంటెంట్ బేస్ ఉన్న కథలపై ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మన హీరోల కథలు ఎంపిక విధానం కూడా మారింది.
యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలను గ్రాండ్ గా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ పరిమితులు పెంచుకొని ప్రేక్షకులకు వినోదం అందించడానికి కొత్తగా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేసవిలో రాబోతున్న సినిమాలన్నీ కూడా ప్రత్యేకమైన చెప్పాలి.
ఫిబ్రవరి 17న శకుంతల సినిమా రిలీజ్ కాబోతుంది. మార్చి 30న నాని దసరా మూవీ రాబోతుంది. ఏప్రిల్ 7న రవితేజ రావణాసుర మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఏప్రిల్ 14న నిఖిల్ స్పై సినిమా ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 14న అల్లరి నరేష్ ఉగ్రం సినిమా రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 21న సాయిధరమ్ తేజ్ విరూపాక్ష రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఏప్రిల్ 28న అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా రాబోతుంది. మే 12న నాగచైతన్య కస్టడీ రిలీజ్ కి రెడీ అవుతుంది. మే 12న ప్రశాంత్ వర్మ తేజ కాంబోలో వస్తున్న హనుమాన్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇలా వేసవి వినోదంగా వస్తున్న సినిమాలలో వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పాలి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించి సూపర్ హిట్ అవుతాయి అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.