Begin typing your search above and press return to search.

రెండో ఛాన్స్‌ ఇచ్చినా నన్ను మోసం చేశాడు

By:  Tupaki Desk   |   14 March 2020 5:17 AM GMT
రెండో ఛాన్స్‌ ఇచ్చినా నన్ను మోసం చేశాడు
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే కెరీర్‌ ఆరంభంలో యంగ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ తో ప్రేమలో పడ్డ విషయం తెల్సిందే. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం దాదాపుగా రెండున్నర మూడు సంవత్సరాలు సాగింది. ఇద్దరి మద్య విభేదాల కారణంగా విడిపోయారు. రణబీర్‌ కపూర్‌ తో విడిపోయిన కొన్నాళ్లకు రణ్వీర్‌ సింగ్‌ తో ప్రేమలో పడటం.. అతడిని పెళ్లి చేసుకోవడం జరిగి పోయింది. పెళ్లి తర్వాత చాలా ఆనందంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్న దీపిక పదుకునే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రణబీర్‌ కపూర్‌ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది.

రణబీర్‌ కపూర్‌ తో బ్రేకప్‌ విషయమై గతంలో ఎప్పుడు నోరు విప్పని ఈ అమ్మడు తాజా ఇంటర్వ్యూ లో ఆయన పేరు ఎత్తకుండా అతడి పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అతడిని నేను నమ్మి ప్రేమించాను. ఒకసారి మోసం చేస్తున్నాడని తెలిసినా రెండవ ఛాన్స్‌ ఇచ్చాను. అతడితో ప్రేమలో ఉన్నందుకు నేను చాలా ప్రేమను ఇచ్చాను. కాని అతడు మాత్రం నన్ను మోసం చేశాడు. అతడి గురించి నా చుట్టు ఉన్న వారు చెబుతున్నా కూడా నేను పట్టించుకోకుండా రెండవ ఛాన్స్‌ ఇచ్చినందుకు నాకు తగిన విధంగా బుద్ది చెప్పాడు.

అతడి వ్యవహారాన్ని నేను రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నాను. అతడు నన్ను రెండవ సారి కూడా మోసం చేయడంతో తట్టుకోలేక పోయానంది. మొదటి సారి అతడు మోసం చేసిన సమయంలో తప్పు నా ప్రేమలో ఉందా లేదంటే నాలో ఏమైనా పొరపాటు ఉందా అనుకున్నాను. రెండవ సారి మోస పోయినట్లుగా తెలుసుకున్న తర్వాత అవతలి వ్యక్తి చెడ్డ వ్యక్తి అనే నిర్ణయానికి వచ్చానంటూ చెప్పుకొచ్చింది. ఒక వ్యక్తి వద్ద నమ్మకం.. గౌరవం పోతే మళ్లీ పొందడం చాలా కష్టమంది. ఆ రెండు లేకపోతే ప్రేమ అనేదే ఉండదనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.

రణబీర్‌ కపూర్‌ ప్లే బాయ్‌ అంటూ దీపిక ఇండైరెక్ట్‌ గా ఇంత పచ్చిగా చెప్పడంతో ఆయన గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన ఆలియా భట్‌ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఆలియా భట్‌ కు ముందు కత్రీనా కైఫ్‌ తో కూడా ప్రేమను ఎంజాయ్‌ చేశాడు. ప్రస్తుతం ఆలియా భట్‌ నెం.5 అంటూ బాలీవుడ్‌ లో ఫన్నీ మీమ్స్‌ వస్తూ ఉంటాయి. తన ప్రియుడు రణబీర్‌ కపూర్‌ గురించి దీపిక చేసిన విమర్శలకు ఆలియా ఏమైనా స్పందించనుందా చూడాలి.