Begin typing your search above and press return to search.
ఈ వారం ఓటీటీ ప్రియులకు మాస్ జాతరే
By: Tupaki Desk | 16 May 2022 9:53 AM GMTమళ్లీ ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర ప్రారంభం కాబోతోంది. థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం ఓటీటీలో సందడి కి రెడీ అవుతున్నాయి. ఇందులో పాన్ ఇండియా వైడ్ గా బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేసిన ట్రిపుల్ ఆర్ కూడా వుండటం విశేషం. అంతే కాకుండా ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్, ఆచార్య స్ట్రీమింగ్ కానుండం విశేషం.
రెండున్నరేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎపిక్ యాక్షన్ డ్రామా -ట్రిపుల్ ఆర్-. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించారు. లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ల ఫిక్షనల్ స్టోరీగా ఈ మూవీని దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి రికార్డులు సృష్టించిన ఈ చిత్రం మే 20న ఓటీటీ దిగ్గజం జీ5 లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే అన్ని సినిమాల తరహాలో సాధారణ స్ట్రీమింగ్ కాకుండా పే పర్ వ్యూ అనే పద్దతిలో ఈ మూవీని స్ట్రీ మింగ్ చేయబోతున్నారు.
ఈ మూవీ తరువాత అదే రోజు ఓటీటీ ప్రేక్షకుల ముందుకొస్తున్న మూవీ -ఆచార్య-. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన యాక్షన్ డ్రామా ఇది. స్టార్ డైరెక్టర్ కొరటలా శివ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన చిత్రమిది. చిరు నుంచి దాదాపు రెండేళ్ల విరామం తరువాత వచ్చిన ఈ ఇచత్రం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. చిరు కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ మే 20న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇక మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ నటించిన -12th మ్యాన్- ఓటీటీలో నేరుగా విడుదల కాబోతోంది. ఇటీవల మోహన్ లాల్ నటించిన చాలా వరకు చిత్రాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలలో విడుదలై సంచలన విజయాల్ని సాధించాయి. -12th మ్యాన్-కూడా అదే స్థాయిలో ఓటీటీలో రిలీజ్ అవుతుండటం గమనార్హం. దృశ్యం, దృశ్యం 2 చిత్రాల దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించిన సినిమా ఇది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ మే 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
యంగ్ హీరో శ్రీవిష్ణు, కేథరిన్ జంటగా నటించిన చిత్రం -భళా తందనాన-. చైతన్య దంతులూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా కూపొందిన ఈ మూవీ కూడా మే 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మే 6న విడుదలైన ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. లాక్ డౌన్ సమయంలో విడుదలై నవ్వులు పూయించిన వెబ్ సిరీస్ -పంచాయత్-. దీనికి సీక్వెల్ గా -పంచాయత్ 2- ని రూపొందించారు. నీనా గుప్తా, జితేంద్ర కుమార్, రఘు వీర్ యాదవ్, జితేంద్ర కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
దీపక్ మిశ్ర దర్శకత్వం వహించిన ఈ వెబ్ డ్రామా మే 20ర అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. ఇదిలా వుంటే ఇదే మే 20న థియేటర్లలో నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రాజశేఖర్ -శేఖర్-, సంపూర్ణేష్ బాబూ -ధగడ్ సాంబా-, కంగనా రనౌత్ -ధాకడ్-, కార్తీక్ ఆర్యన్ -భూల్ బులాయా 2- వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి.