Begin typing your search above and press return to search.
మోనాల్ - హారిక.. ఉండేది ఎవరు? పోయేది ఎవరు?
By: Tupaki Desk | 11 Dec 2020 4:07 PM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 4 చివరి ఎలిమినేషన్ మిగిలి ఉంది. ఇంట్లో మిగిలి ఉన్న ఆరుగురిలో ఈ ఆదివారం ఒక్కరు ఎలిమినేట్ అవ్వనుండా మిగిలిన అయిదుగురు చివరి వారంకు వెళ్లబోతున్నారు. అఖిల్ ఇప్పటికే ఫైనల్ వీక్ కు వెళ్లి పోయాడు. అభిజిత్ సోహెల్ లు చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో వారు ఖచ్చితంగా ఫైనల్ వారంకు వెళ్తారని ప్రతి ఒక్కరు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అరియానాకు అనూహ్యంగా వర్మ నుండి సపోర్ట్ రావడంతో పాటు ఆమె మొదటి నుండి కూడా తన మార్క్ ఆటను కొనసాగిస్తున్న కారణంగా అభిమానులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు మోనాల్ మరియు హారికల్లో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
మోనాల్ ను మొదట బిగ్ బాస్ కాపాడుతూ వచ్చాడు అంటూ విమర్శలు వచ్చాయి. కాని ఇప్పుడు మోనాల్ కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. అఖిల్ ను అభిమానించే వారు అంతా కూడా ఈ వారం మోనాల్ కు ఓట్లు వేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక నిజం అయితే మోనాల్ సేవ్ అయ్యి హారిక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇద్దరిలో ఎవరు అనేది స్పష్టంగా చెప్పలేక పోయినా ఇద్దరిలో ఒకరు మాత్రం అని చాలా నమ్మకంగా బిగ్ బాస్ క్లోజ్ ఫాలోవర్స్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఏదైనా ఓటింగ్ లో గోల్ మాల్ జరగడం లేదంటే బిగ్ బాస్ నిర్వాహకులు సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు వీరిద్దరిలో ఒక్కరు కాకుండా మరెవ్వరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగనుందో మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే రానుంది. ఇప్పటి వరకు వచ్చినారంటే వారు చాలా స్ట్రాంగ్. కనుక ఈ వారం ఎలిమినేట్ అయినంత మాత్రాన బాధ పడాల్సిన అవసరం లేదనేది కొందరి మాట.