Begin typing your search above and press return to search.

ఈవారం ఓటీటీలో సందడే సందడి

By:  Tupaki Desk   |   2 Dec 2022 1:56 PM GMT
ఈవారం ఓటీటీలో సందడే సందడి
X
ప్రతి శుక్రవారం థియేటర్ ల ద్వారా దేశ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. ప్రతి భాషలో కూడా వారం వారం ఏదో ఒకటి లేదా అంతకు మించి సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. ఒక వైపు థియేట్రికల్ రిలీజ్‌ కు పదుల సంఖ్యలో సినిమాలు ఉన్నా కూడా ఓటీటీ ద్వారా కూడా సినిమాలు మరియు సిరీస్‌ లు పెద్ద సంఖ్యలో వారం వారం స్ట్రీమింగ్‌ అవుతూనే ఉన్నాయి.

ఈ వారం కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు చాలా సినిమాలు మరియు సిరీస్ లు వచ్చాయి. తెలుగు తో పాటు ఇతర భాషల్లోని క్రేజీ సినిమాలు మరియు సిరీస్ లు స్ట్రీమింగ్‌ అవుతు ఉండటంతో ఈ వీకెండ్‌ ఫుల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఖాయం అంటూ ఓటీటీ ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు.

తెలుగు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా అమెజాన్ ప్రైమ్‌ ద్వారా వచ్చింది. థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి ఆకట్టుకోలేక పోయినా కూడా ఓటీటీ లో జిన్నా మెప్పించే అవకాశాలు లేక పోలేదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇక తమిళంలో సూపర్ హిట్‌ అయ్యి తెలుగు లో కూడా డబ్ అయిన లవ్‌ టుడే ను నెట్‌ ఫ్లిక్స్ ద్వారా తమిళ వర్షన్ ను తీసుకు వచ్చారు.

హిందీలో రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించిన గుడ్‌ బై సినిమాను కూడా నేటి నుండి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆహా ఓటీటీ ద్వారా ధర్మస్థలి అనే సినిమా వచ్చింది. మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్‌ మాన్ స్టర్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలు మరియు సిరీస్ లు కూడా తెలుగు మరియు ఇతర భాషల ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సబ్‌ టైటిల్స్ తో ఒక భాష సినిమాను మరో భాష ప్రేక్షకులు చూసే వెసులుబాటు ఉంది. కనుక ఈ వారం చాలా చాలా సినిమాలు మరియు సిరీస్ లు ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

వచ్చే వారం కొత్త సినిమాలు సిరీస్‌ లు వచ్చేప్పటి వరకు కూడా ఈ వారం స్ట్రీమింగ్‌ అవుతున్న కంటెంట్‌ చూడటం పూర్తి కాకపోవచ్చు అంటూ ఓటీటీ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.