Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ ఫైట్‌..నిలిచేది ఎవ‌రు..గెలిచేది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   27 July 2022 2:30 PM GMT
బాక్సాఫీస్ ఫైట్‌..నిలిచేది ఎవ‌రు..గెలిచేది ఎవ‌రు?
X
ఈ వారం బాక్సాఫీస్ ఫైట్ ర‌స‌వ‌త్త‌రంగా మార‌బోతోంది. నాలుగు క్రేజీ సినిమాలు ఈ వారం పోటీప‌డ‌బోతున్నాయి. ప్ర‌తీ వారం మూడు నాలుగు సినిమాలు విడుద‌లైన‌ట్టే ఈ వారం కూడా రెండు రోజుల్లో నాలుగు సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. రోజుకి రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఇందులో ముందుగా జూలై 28న ఇద్ద‌రు భిన్న‌మైన వ్య‌క్తుల సినిమాలు పోటీప‌డ‌బోతున్నాయి. అందులో ఒక‌రు క‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్ న‌టించిన పాన్ ఇండియా మూడీ `విక్రాంత్ రొణ`.

అనూప్ బండారి రూపొందించిన ఈ మూవీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ఫాంట‌సీగా తెర‌కెక్కింది. సినిమాలోని ఓ పాట మాత్రం వైర‌ల్ అయిందే కానీ సినిమాపై మాత్రం ఎలాంటి బ‌జ్ క్రియేట్ కాలేదు. అయితే కిచ్చా సుదీప్ మాత్రం పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న ఈమూవీపైనే భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. ఇక ఇదే సినిమాతో పోటీప‌డుతూ తమిళ‌నాడు బిజినెస్ మేన్ అరుళ్ శ‌ర‌వ‌ణ‌న్ 51 ఏళ్ల వ‌య‌సులో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న న‌టించిన మూవీ `ది లెజెండ్‌`.

జేడీ జెర్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఊర్వ‌శీ రౌతేలా హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. 51 ఏల్ల వ‌య‌సులో త‌నే హీరోగా, నిర్మాత‌గా సినిమాని అరుళ్ శ‌ర‌వ‌ణ‌న్ నిర్మించి న‌టించ‌డం, 60 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేయ‌డంతో `ది లెజెండ్` హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ మూవీ త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `రామారావు ఆన్ డ్యూటీ` జూలై 29న విడుద‌ల కాబోతోంది.

`ఖిలాడీ` డిజాస్ట‌ర్ గా మార‌డంతో ర‌వితేజ ఆశ‌ల‌న్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నాడు. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీకి మ‌రింత బ‌జ్ క్రియేట్ కావాల్సింది. ఈ మూవీతో పాటు `పంచ‌తంత్ర క‌థ‌లు` అనే చిన్న సినిమా కూడా వ‌చ్చేస్తోంది. అయితే దీనికి ఎలాంటి ప్ర‌చారం కానీ బ‌జ్ కానీ కనిపించడం లేదు. ఫ్రీ ప్రీమియర్స్ తో మంచి టాక్ ని సొంతం చేసుకున్నా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌న్న‌ది అనుమాన‌మే. అంతే కాకుండా ఈ మూవీకి పెద్ద‌గా థియేట‌ర్స్ ల‌భించ‌లేదు.

ఈ నాలుగు సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద‌గా లేవ‌ని తెలుస్తోంది. రెండు స్ట్రెయిట్ సినిమాలు.. ఒక త‌మిళ చిత్రం.. ఒక క‌న్న‌డ మూవీ రొండు రోజుల్లో పోటీప‌డుతున్నాయి. మ‌రి ఈ బాక్సాఫీస్ ఫైట్‌..నిలిచేది ఎవ‌రు..గెలిచేది ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.