Begin typing your search above and press return to search.
'గీత గోవిందం' జోరును అడ్డుకోగలరా?
By: Tupaki Desk | 23 Aug 2018 2:30 PM GMTగీత వారం విడుదలైన ‘గీత గోవిందం’ సినిమాకు మామూలుగా కలిసి రాలేదు. ఆ చిత్రంపై ముందు నుంచే మంచి అంచనాలుండగా.. దానికి పోటీగా కొత్త సినిమాలేవీ రిలీజ్ కాలేదు. పైగా ముందు వారం వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’.. ‘విశ్వరూపం-2’ చిత్రాలు తేలిపోయాయి. అంతకుముందు వారం వచ్చిన ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ అప్పటికే జోరు తగ్గించేశాయి. ఇలా మొత్తంగా గ్రౌండ్ క్లియర్ అయిపోయింది ఈ చిత్రానికి. పైగా బుధవారమే రిలీజ్ చేయడంతో లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ దక్కింది. ఇలా ఇన్ని సానుకూలతల మధ్య ఆ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. వీకెండ్ తర్వాత కూడా నిలకడగా వసూళ్లు సాగుతున్నాయి. ఈ రేంజి సినిమాలకు వీకెండ్లో వచ్చే వసూళ్లు వీక్ డేస్ లో వస్తుండటం విశేషం. ఐతే ఈ శుక్రవారం ఒకటికి నాలుగు సినిమాలు రిలీజవుతుండటంతో ‘గీత గోవిందం’ వసూళ్లపై ఏమైనా ప్రభావం పడుతుందా లేదా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నిజానికి నాలుగు సినిమాలు రిలీజవుతున్నా.. ఇందులో రెండు సినిమాల్ని లెక్కలోకే తీసుకోనక్కర్లేదు. ప్రభుదేవా ప్రత్యేక పాత్ర చేసిన తమిళ సినిమా ‘లక్ష్మి’పై పెద్దగా అంచనాలేమీ లేవు. అలాగే రష్మి ప్రధాన పాత్రలో నటించిన ‘అంతకుమించి’ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇవి రెండూ నామమాత్రంగానే రిలీజవుతున్నాయి. ఇక మిగతా రెండు చిత్రాల్లో ‘నీవెవరో’ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆది పినిశెట్టి.. తాప్సి.. రితిక సింగ్ నటించిన ఈ చిత్రంపై ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా.. దీని ప్రోమోలు ఆకర్షించాయి. అలాగని దీనికి పెద్ద ఓపెనింగ్స్ వస్తాయని ఏమీ ఆశించట్లేదు. సినిమాకు టాక్ బాగుంటే కచ్చితంగా ప్రభావం ఉంటుంది. మరో చిత్రం ‘ఆటగాళ్ళు’పై అంచనాలు తక్కువే. నారా రోహిత్ ట్రాక్ రికార్డు దెబ్బ తినడం.. హీరోగా జగపతిబాబుకు మార్కెట్ లేకపోవడం.. చాలా ఏళ్ల పాటు లైమ్ లైట్లో లేని పరుచూరి మురళి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో దీనికి బజ్ తక్కువే ఉంది. దీనికి కూడా టాక్ ఎలా ఉంటుందన్నది కీలకం. వీటికి మరీ గొప్ప టాక్ వస్తే తప్ప ‘గీత గోవిందం’ రెండో వారాంతంలో ఆధిపత్యం చలాయించే అవకాశాలే ఎక్కువ. వీటికి బ్యాడ్ టాక్ వస్తేమాత్రం జోరు మామూలుగా ఉండదు.