Begin typing your search above and press return to search.

ఈ అయిదుగురు ముద్దుగుమ్మలకు ఈ ఏడాది అత్యంత కీలకం

By:  Tupaki Desk   |   19 Jan 2023 2:30 AM GMT
ఈ అయిదుగురు ముద్దుగుమ్మలకు ఈ ఏడాది అత్యంత కీలకం
X
టాలీవుడ్‌ లో ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు వాళ్లు... సూపర్ హిట్స్ దక్కించుకున్న వాళ్లే అట్టర్‌ ఫ్లాప్స్ ను కూడా చవి చూశారు. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్స్‌ తెలుగు లో మోస్ట్‌ వాంటెడ్ గా ఉన్నారు.. ఈ ఏడాది తర్వాత కూడా వారు వాంటెడ్‌ హీరోయిన్స్ గా కొనసాగాలి అంటే వారు చేస్తున్న సినిమాలు కచ్చితంగా హిట్‌ అవ్వాల్సిన అవసరం ఉంది.

పూజా హెగ్డే టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా స్టార్‌ డమ్ దక్కించుకుంది. కానీ ప్రస్తుతం మహేష్‌ బాబు.. త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా కాకుండా మరేది కూడా చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ సినిమా మూవీ హిట్ అయితే తప్ప తెలుగు లో ఈమెకు ఆఫర్లు వచ్చే అవకాశం లేదు అనే టాక్ వినిపిస్తోంది.

రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడి యొక్క క్రేజ్ ఒక్కసారిగా అలా పెరిగింది. అయితే ముద్దుగుమ్మ యొక్క భారీ పారితోషికం డిమాండ్ వల్ల అలాగే హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టడం వల్ల తెలుగు లో ఆఫర్లు పెద్దగా లేవు అనే టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 సినిమా ను చేస్తున్న రష్మిక మందన్నా ఆ సినిమాతో హిట్ కొడితే మళ్లీ టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా నిలిచే అవకాశం ఉంది.

ఉప్పెన సినిమాతో కృతి శెట్టి అనూహ్యంగా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్ సొంతం చేసుకుంది, కానీ చాలా తక్కువ సమయంలోనే బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో ఈ అమ్మడి ప్రస్తుతం చేస్తున్న నాగ చైతన్య కస్టడి సినిమాపై ఆశలు పెట్టుకుని ఉంది. ఆ సినిమా హిట్ అయితేనే తెలుగు నుండి ఈమెకు మళ్లీ ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మహానటి బ్యూటీ కీర్తి సురేష్ కూడా తెలుగు లో ఎక్కువ తక్కువ సినిమాలు చేయడం లేదు. సర్కారు వారి పాట సినిమా తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ ఈ ఏడాది నానితో కలిసి దసరా సినిమాతో రాబోతుంది. దసరా సినిమా ఫలితం కీర్తి సురేష్ కు అత్యంత కీలకంగా మారింది.

బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా అద్వానీ తెలుగు లో మొదట భరత్ అనే నేను సినిమా తో సక్సెస్ దక్కించుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాతో ఫ్లాప్‌ ను చవి చూసింది. తెలుగు లో బిజీ గా సినిమాలు చేయాలి అంటే ప్రస్తుతం చరణ్ తో కలిసి నటిస్తున్న సినిమా హిట్ అవ్వాల్సి ఉంది. మరి ఈ అమ్మడికి హిట్ దక్కేనా చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.