Begin typing your search above and press return to search.
తొలిప్రేమ ట్రిక్స్ స్టార్ట్ చేసారు
By: Tupaki Desk | 13 Feb 2018 12:35 PM GMTప్రస్తుతమున్న పరిస్థితుల్లో సినిమా బాగుంది అనే టాక్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం నిర్మాతలకు కత్తి మీద సాములా మారుతోంది. మొదటి మూడు నాలుగు రోజులు ఆహా ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపించడం ఆ తర్వాత తీరా టికెట్ కౌంటర్ల వద్ద చూస్తే దానికి తగ్గ వసూళ్లు లేకపోవడం నిర్మాతలను ఖంగారు పెట్టిస్తోంది. గత ఏడాది సోషల్ మీడియా ఆకాశానికెత్తిన ఒక బడ్జెట్ మూవీ, మరొక భారీ బడ్జెట్ చివరికి నిర్మాతలకు నష్టాలే మిగిల్చాయి. అందుకే టాక్ కాపాడుకునేలా ప్రమోషన్ కొనసాగించడం చాలా ముఖ్యం. తొలిప్రేమ టీం ప్రస్తుతం అదే పనిలో ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో భాగంగా ఒక వెరైటీ స్కీం రూపొందించారు.
దాని ప్రకారం ఎవరైనా సరే తమ తొలిప్రేమను గెలుచుకుని ప్రేమించినవాళ్ళనే జీవిత భాగస్వామిగా పొంది ఉంటే కనక ఒక నిమిషం పాటు వీడియో చేసి పంపిస్తే అన్నింటిని పరిశీలించి విజేతలకు తొలిప్రేమ టీంను కలిసే ఛాన్స్ కలిగిస్తారట. బాగానే ఉంది. కాని ఇక్కడో డౌట్ అందరి బుర్రలను తొలిచేస్తోంది. టీనేజ్ వయసు ఎంటర్ అయ్యాక దాదాపు ప్రతి ఒక్కరికి తొలిప్రేమ లేదా ఫస్ట్ క్రష్ అనేది ఉంటుంది. అది సహజం. కాని అది రియల్ లైఫ్ లో పెళ్లి దాకా తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. సెకండ్ లవ్ లేదా థర్డ్ లవ్ ఏదో ఒక చోట సక్సెస్ అయినవాళ్లు మాత్రం లెక్కలేనంత జంటలు ఉంటాయి. మరి కేవలం తొలిప్రేమలో విజయం సాధించిన వాళ్ళే వీడియో పంపాలి అనడం కొంత నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.
సినిమా అనేది నాటకీయత ఎక్కువగా ఉండే ప్రక్రియ. తొలిప్రేమ సినిమాలో కూడా ఇది ఉంది. ట్రైన్ లో కౌగిలించుకోగానే హీరొయిన్ ఏమి అనకపోవడం, రైల్వే స్టేషన్లో హీరొయిన్ ని రౌడీలు అల్లరి పెడితే హీరో వీరోచితంగా ఫైట్ చేసి ఇంప్రెస్ చేయటం ఇదంతా రియల్ లైఫ్ లో జరిగే వ్యవహారం కాదు. సో ఇది ప్యూర్ న్యాచురల్ లవ్ అనలేం. కాని వెంకీ అట్లూరి తర్వాత దాన్ని టేకప్ చేసిన విధానం, కాలేజీలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యి యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు ఈ తొలిప్రేమ వీడియోల ప్రమోషన్ జిమ్మిక్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.