Begin typing your search above and press return to search.

పెద్ద హిట్టే.. కాని 'ఫిదా'లో సగం అంతే

By:  Tupaki Desk   |   4 April 2018 5:52 AM GMT
పెద్ద హిట్టే.. కాని ఫిదాలో సగం అంతే
X
మెగా హీరోలందరు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నారు. కానీ ఇంకా వరుణ్ తేజ్ అందుకోలేదేంటి అని అనుకుంటున్న సమయంలో ఫిదా సినిమాతో విమర్శకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు వరుణ్ తేజ్. సినిమాలో సింపుల్ గా నటించేసి మాస్ హీరోలు కూడా వసూలు చేయలేని కలెక్షన్స్ ని అందుకున్నాడు. ఏకంగా 50 కోట్ల వరకు షేర్స్ అందుకున్న ఆ సినిమా వరుణ్ తేజ్ మార్కెట్ ను చాలా పెంచేసింది. దీంతో నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్ లో వసూలు చేస్తుందని అంతా అనుకున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి కలెక్షన్స్ పరంగా ఫిదా స్థాయిలో హిట్ అవ్వలేదు. ఫిదా 50 కోట్ల షేర్స్ వస్తే.. తొలి ప్రేమ మొత్తంగా రూ.45.1 కోట్ల గ్రాస్ అందుకొని 23.95 కోట్ల షేర్స్ ను వసూలు చేసింది. ఇదే తొలిప్రేమ ఫైనల్ కలెక్షన్ రిపోర్ట్. ఏపి తెలంగాణ లోనే సినిమా 18.55 కోట్ల వరకు షేర్స్ ను అందుకుంది. యూఎస్ లో 3.2 కోట్లతో సరిపెట్టుకుంది. వరల్డ్ వైడ్ థ్రియేటికల్ రైట్స్ పరంగా 23 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా ఓ విధంగా నష్టపోకుండా బయ్యర్లని సేఫ్ జోన్ లో నిలబెట్టింది.

కానీ ఫిదా తరువాత అందులో సగం షేర్స్ ని మాత్రమే అందుకోవడం చూస్తుంటే వరుణ్ సోలో మార్కెట్ ఇంకా పెరగాల్సి ఉందనే విషయం అర్ధమవుతోంది. శేఖర్ కమ్ముల - సాయి పల్లవి కాంబినేషన్ వల్ల సినిమా ఆ స్థాయి కలెక్షన్స్ అందుకుందని రుజువయ్యింది. వరుణ్ తేజ్ నటన కూడా ఆ సినిమాకు ప్లస్ పాయింట్. కానీ ఫిదా క్రేజ్ తొలిప్రేమకు అనుకున్నంతగా ఉపయోగపడలేదు.