Begin typing your search above and press return to search.
అర్జున్ రెడ్డికి తొలిప్రేమ సెట్టయ్యింది
By: Tupaki Desk | 7 Feb 2018 1:21 PM GMTసోషల్ మీడియా వచ్చిన తరువాత ఇంటర్నెట్ పై కాస్త పట్టు ఉన్న నెటిజన్స్ క్రియేటివిటీ బయటపెడుతుండడం ఈ రోజుల్లో కామన్. ఎక్కువగా సినిమాకు సంబందించిన ట్రిక్కులు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తుంటాయి. అలాగే డైలాగ్స్ పేరడీ ఇంకా స్పూఫ్ - ట్రాల్స్ లాంటివి చాలానే వస్తుంటాయి. ఇక ఒక్కోసారి లేటెస్ట్ సాంగ్స్ కి మరో హీరో పాట విజువల్స్ వేస్తుండడం చాలా సరదాగా అనిపిస్తుంటుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డి విజువల్స్ ఇప్పుడు తొలిప్రేమ పాటలో కనిపిస్తున్నాయి. ఆదిత్య మ్యూజిక్ వారు సరదాగా చేసిన ఈ క్లిప్ నెటిజన్స్ ని చాలా ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాకు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఉన్న బ్రేకప్ సాంగ్ నిజమేనా నిజమేనా అనే దానికి కరెక్ట్ గా అర్జున్ రెడ్డి కాన్సెప్ట్ టచ్ అయ్యింది. అర్జున్ రెడ్డి సినిమాలో తెలిసేనా అనే సాంగ్ విజువల్స్ తొలిప్రేమకు తగ్గట్టు ఉన్నాయి.
అప్పుడపుడు ఇలాంటి మ్యాజిక్ కాంబినేషన్ చాలా అరుదుగా జరుగుతుంటుంది. చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమాకు ఈ పాట కరెక్ట్ గా సెట్ అయ్యి ఉండేదేమో అనిపిస్తోంది. ఇక తొలిప్రేమ సినిమాలో పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. సినిమాపై కూడా అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఫిబ్రవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.