Begin typing your search above and press return to search.

టీజర్ టాక్‌ః తొలిప్రేమ.. గాయమా!!

By:  Tupaki Desk   |   20 Dec 2017 5:15 AM GMT
టీజర్ టాక్‌ః తొలిప్రేమ.. గాయమా!!
X
'మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చెళ్ళినా.. ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని.. ఎప్పటికీ మర్చిపోలేం' అంటూ ఒక సింగిల్ లైన్లో అసలు తొలిప్రేమ సినిమా కథేంటి అనే విషయాన్ని చెప్పేశాడు నూతన దర్శకుడు వెంకీ అట్లూరి. ఇంతకీ ఇదంతా ఎవరికోసం అనేగా? మెగా హీరో వరుణ్‌ తేజ్ కొత్త సినిమా 'తొలిప్రేమ' కోసం. పదండి అసలు ఈ కథాకమామిషూ ఏంటో చూద్దాం.

'తొలిప్రేమ' అంటూ మన ముందుకు వస్తున్నాడు వరుణ్‌ తేజ్. అయితే మొన్న ఫస్ట్ లుక్ పోస్టర్లో క్లీన్ షేవ్ లుక్కుతో అదరగొట్టిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు లండన్ బ్యాక్ డ్రాప్ లో తన గెడ్డం లుక్కులో గత్తాన్ని చెబుతున్నట్లు ఉన్నాడు. ఈ ఒక్క టీజర్ ను చూస్తే చాలు.. ఇదో ఫక్తు లవ్ స్టోరి అనే విషయం మనకు తెలుస్తోంది. ఇకపోతే జార్జ్ సి విలయమ్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. అలాగే తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాయి. ఈ సినిమాకు ఓ రకంగా అవే ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. 'తొలి ప్రేమ.. నీ గుండెలో గాయమా' అంటూ సాగే లైన్స్ బాగున్నాయి.

అయితే వరుణ్‌ తేజ్ ఒక శాడ్ లవ్ స్టోరీతో వస్తున్నాడా అంటూ ఈ టీజర్ చూస్తే కొంతమంది హార్డ్ కోర్ అభిమానులు హర్టవుతున్నారు. ఎందుకంటే వారి హీరో గుండెకు గాయమైతే వారు తట్టుకోలేరట. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా.. ఇతర పాత్రల్లో సుహాసిని మణిరత్నం, ప్రియదర్శి నటిస్తున్నారు. బివిఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.