Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: వర్షతో ఆదిత్య తొలిప్రేమ

By:  Tupaki Desk   |   2 Feb 2018 6:24 AM GMT
ట్రైలర్ టాక్: వర్షతో ఆదిత్య తొలిప్రేమ
X
వరుణ్‌ తేజ్ ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయకుండా కాస్త డిఫరెంట్ పంథాలో నడిచే సినిమాలను ఎంచుకుంటున్నాడు. మొన్న వచ్చిన ఫిదా అందుకు సాక్ష్యం అయితే.. ఇప్పుడు వస్తున్న తొలిప్రేమ కూడా అందుకు నిదర్శనంగానే కనిపిస్తోంది. ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు. పదండి ఎలా ఉందో చూద్దాం.

తొలిచూపులోనే వర్ష అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు ఆదిత్య. ఆ తరువాత వారు జీవితంలో మరో రెండు సార్లు కలవడం విడిపోవడం జరుగుతుంది. అయితే ఎందుకు విడిపోయారు అనే విషయంపైనే దర్శకుడు చాలా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ తో నడిచే వరుణ్‌ తేజ్ మరియు రాశి ఖన్నాల ప్రణయ కావ్యం ఈ సినిమాలో హైలైట్ కానుందని ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. ముఖ్యంగా కాలేజీ క్యాంపస్ లవ్ స్టోరీని కాస్త ఉద్రేకంగా.. అలాగే లండన్ లో ఉద్యోగం చేసే టైములో కాస్త మెట్యూర్డ్ గా.. బాగానే తెరకెక్కించాడు కొత్త దర్శకుడు. కామెడీ కూడా బాగానే ఉందనిపిస్తోంది.

ఇకపోతే ఈ సినిమాకు జార్జ్ విలియమ్స్ కెమెరా వర్క్.. అలాగే తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా నప్పాయి. వారి కారణంగా ఇంకాస్త మ్యాజిక్ వచ్చేసిందని చెప్పొచ్చు. కాకపోతే ఇటువంటి లవ్ స్టోరీలు ఎక్కడ ఏ మాత్రం బోర్ కొట్టించినా కూడా.. పాటలు సూపర్ హిట్టయినా రిజల్టు తేడా కొట్టిన 'ఆరెంజ్' సినిమా తరహాలో ఉంటాయి. మరి సినిమా మొత్తంగా ఎలా ఉండోబోతంది అనేది రిలీజ్ రోజున చూడాల్సిందే.