Begin typing your search above and press return to search.
తోలు బొమ్మలాట బ్యూటీ కేరాఫ్ ప్రకాశం జిల్లా
By: Tupaki Desk | 15 Nov 2019 4:44 AM GMTకొత్త అమ్మాయిలు చాలామంది వచ్చేస్తున్నారు. అయితే.. వారిలో గ్లామరు.. గ్రామరూ ఉన్నోళ్లు కొద్ది మందే. చూసినంతనే కనెక్ట్ అయ్యే బ్యూటీ కొందరి లోనే ఉంటుంది. ఇప్పుడు ఆ కోవకే చెందింది హర్షిత. ఎవరీ అమ్మాయి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం లో వస్తున్న తోలు బొమ్మలాట లో హీరోయిన్ గా చేసిందీ భామ.
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కొరత తీవ్రం గా ఉన్న వేళ.. అసలుసిసలు తెలుగమ్మాయి గా ఉంటూ.. గ్లామరస్ హీరోయిన్ సరుకున్న భామలు కొందరే కనిపిస్తారు. అలాంటి క్వాలిటీస్ ఎక్కువ గా ఉన్న భామ గా హర్షిత ను చెప్పాలి. యాడ్ ఫిలింస్ చేసిన ఆమె తొలి సినిమా తోలు బొమ్మలాట.
మాస్ కమ్యునికేషన్స్ చేసిన హర్షితది సొంతూరు ప్రకాశం జిల్లానట. అయితే.. హైదరాబాద్ లో ఫ్యామిలీ సెటిల్ అయ్యిందన్న ఈ భామకు సినిమాలే లోకం కాదని.. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెబుతోంది. ఐటీ ఉద్యోగిని గా నటించినట్లు చెప్పిన హర్షితకు సినిమా అవకాశం వచ్చిన విషయం ఇంట్లో చెప్పినంతనే.. మనకివన్నీ అవసరమా? అని అడిగారట.
చివర కు కన్వీన్స్ చేయటంతో ఇంట్లో వారు ఓకే చెప్పారని.. వారి సపోర్ట్ ఫుల్ గా ఉందని చెబుతోంది. ఈ నెలలో విడుదలవుతున్న ఈ సినిమా తో పాటు.. తన కెరీర్ గురించి చెబుతూ.. అవకాశాలు ఎంపిక చేసుకునే స్థాయి లో తాను లేనని.. తనకు వచ్చిన ఛాన్సుల్లో అన్ని చూసుకొని తాను ఓకే చెప్పాలనుకున్నట్లు ఉన్నది ఉన్నట్లు గా నిజాన్ని ఒప్పేసుకోవటం గమనార్హం. లుక్స్ పరంగా ఏ లోటు లేని ఈ బ్యూటీ కి తొలి సినిమా ఎంతలా కలిసి వస్తుందో చూడాలి.