Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ హాస‌న్‌ కి అవార్డులే అవార్డులు

By:  Tupaki Desk   |   16 Nov 2015 4:38 AM GMT
క‌మ‌ల్ హాస‌న్‌ కి అవార్డులే అవార్డులు
X
మ‌న‌వాళ్లంతా ఈ ఏడాదిని నంద‌మూరి నామ సంవ‌త్స‌రం అని ముచ్చ‌టించుకున్నారు. ప‌టాస్‌ - టెంప‌ర్ విజ‌యాల‌తో నంద‌మూరి హీరోలు లైమ్‌ లైట్‌ లోకొచ్చేశారు. అయితే కోలీవుడ్‌ లో మాత్రం ఈ ఏడాది క‌మ‌ల్‌ హాస‌న్‌ దే అంటే త‌ప్పేం కాదు. అత‌డు న‌టించిన మూడు సినిమాలు ఈ సంవ‌త్స‌రం రిలీజ‌య్యాయి. ప్ర‌తి సినిమాకి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లొచ్చాయి. ముఖ్యంగా పాప‌నాశం (దృశ్యం రీమేక్‌) ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఉత్త‌మ విల‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించినంత మెరుగైన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. అంత‌కుమించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇందులో క‌మ‌ల్ ద్విపాత్రాభిన‌యం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. లేటెస్టుగా అత‌డు న‌టించిన చీక‌టిరాజ్యం దీపావ‌ళి కానుక‌గా రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించింది.

అందుకే 2015ని క‌మ‌ల్ నామ సంవ‌త్స‌రం అని డిక్లేర్ చేస్తే త‌ప్పేం లేదు. అంతేకాదు అత‌డు న‌టించిన ఉత్త‌మ విల‌న్ చిత్రం ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్టివ‌ల్‌ లో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. అక్క‌డ ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఏకంగా నాలుగు అవార్డులు ద‌క్కించుకుందీ చిత్రం. ఉత్త‌మ న‌టుడిగా క‌మ‌ల్‌ హాస‌న్, ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా ఘిబ్రాన్‌ - ఉత్త‌మ సౌండ్ డిజైన‌ర్‌ గా కునాల్ రాజ‌న్ అవార్డులు అందుకున్నారు. ఇదే చిత్రానికి ఇప్ప‌టికే ర‌ష్య‌న్ ఇంటర్నేష‌న‌ల్ ఫిలింఫెస్ట్‌ లో ఘిబ్రాన్ ఉత్త‌మ సంగీత‌ద‌ర్శ‌కుడిగా అవార్డు అందుకోవ‌డం విశేషం. ఏ కోణంలో చూసినా ఈ క్రెడిట్ అంతా క‌మ‌ల్‌ హాస‌న్‌ దే. అందుకే ఈ ఏడాదిని క‌మ‌ల్‌ నామ సంవ‌త్స‌రం అని ఫిక్స్ చేయాల్సిందే.