Begin typing your search above and press return to search.
ఆ వ్యాధితో బాధపడుతున్న థోర్.. సినిమాలకు బ్రేక్..!
By: Tupaki Desk | 23 Nov 2022 12:30 AM GMTమార్వెల్ స్టూడియోస్ క్రియేట్ చేసిన పాత్రల్లో థోర్ ఒకరు. ఆ పాత్రలో క్రిస్ హెమ్స్ వర్త్ అద్భుత నటనని కబరిచారు. సూపర్ హీరో థోర్ మార్వెల్ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్న ఫ్రాంచైస్ అన్నిటిలో ఉంటున్నారు. వరల్డ్ వైడ్ గా థోర్ కి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు.
థోర్ పాత్రలో క్రిస్ హెమ్స్ వర్త్ తన డ్యాషింగ్ లుక్ తో కనిపిస్తారు. అయితే సడెన్ గా క్రిస్ హెమ్స్ వర్త్ నటనకు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. థోర్ పాత్రతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న క్రిస్ హెమ్స్ వర్త్ డిస్నీ ప్లస్ కోసం లిమిట్ లెస్ డాక్యుమెంటరీ సీరీస్ చేయాల్సి ఉంది.
అందుకోసం కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయగా అతనికి అల్జీమర్స్ బారిన పడినట్టు తేలింది. రీసెంట్ గా ది వేనిటీ ఫెయిర్ తో ఆయన మాట్లాడుతూ అల్జీమర్స్ నుంచి బయట పడేంత వరకు నటకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా అని చెప్పారు.
అల్జీమర్స్ వల్ల కన్ ఫ్యూజన్, జ్ఞాపక శక్తి తగ్గడం, కమ్యూనికేషన్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇది కచ్చితంగా తన తల్లిదండ్రుల నుంచి వచ్చి ఉండొచ్చని అంటున్నారు క్రిస్. పరీక్షల్లో తనలో ఏపీవోఈ 4 ఉన్నట్టు తేలిందని.. వాటి వల్ల మిగతా వారి కన్నా 8 నుంచి 10 రెట్లు ఎక్కువ అల్జీమర్స్ ఉంటుందని వెల్లడించారు.
అనారోగ్య సమస్యల వల్లే తను నటనకు విరామం తీసుకుంటున్నానని అన్నారు క్రిస్ హెమ్స్ వర్త్. పూర్తిగా సినిమాలకు దూరం కాలేదు అని కొన్నాళ్లు మాత్రమే సినిమాలు చేయనని అంటున్నారు. అల్జీమర్స్ వ్యాధి నుంచి కోలుకున్నా ఆ ట్రీట్ మెంట్ ప్రభావం జీవితాంతం ఉంటుందని అన్నారు క్రిస్ హెమ్స్ వర్త్.
అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్టు పూర్తిగా నిర్ధారణ కాలేదు.. అయితే వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ శాతం ఉందని అంటున్నారు హెమ్స్ వర్త్. ఏపీవోఈ 4 జన్యువులు ఉన్నాయంటే అల్జీమర్స్ వస్తుందని కాదు.. కాకపోతే అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు హెమ్స్ వర్త్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.