Begin typing your search above and press return to search.
ఖలేజా..లీడర్..పంజా..ఆరెంజ్: నాగ్ ఆశ్విన్
By: Tupaki Desk | 6 Sep 2019 4:30 PM GMTడైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించింది రెండు సినిమాలే కానీ పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కిస్తే కానీ రాని కీర్తిని సాధించాడు. ఆ రెండూ సినిమాలు కూడా నాగ్ అశ్విన్ అభిరుచికి.. ఫిలిం మేకింగ్ క్వాలిటీకి అద్దం పడతాయి. ఇక నాగ్ అశ్విన్ ఏదైనా ట్వీట్ చేసినా.. ఏ విషయంపైనైనా తన అభిప్రాయం వ్యక్తం చేసినా అందులో ఒక లాజిక్ ఉంటుంది.
నాగ్ అశ్విన్ తాజాగా తన ఇన్స్టా ఖా తా ద్వారా కొన్ని కమర్షియల్ గా విఫలమైన చిత్రాల గురించి ప్రస్తావిస్తూ అవిబాక్స్ ఆఫీస్ వద్ద మెరుగైన ఫలితం అందుకొని ఉంటే తెలుగు సినీ పరిశ్రమ దశ దిశ మరోరకంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. "బాక్స్ ఆఫీస్ దగ్గర ఖలేజా.. లీడర్.. పంజా.. ఆరెంజ్.. అందాల రాక్షసి.. డియర్ కామ్రేడ్.. లాంటి మరికొన్ని చిత్రాలు కనుక మెరుగైన ఫలితాన్ని నమోదు చేసి ఉంటే ఇండస్ట్రీ యొక్క గమనాన్ని అవి మార్చి ఉండేవేమో. ముఖ్యంగా 'ఖలేజా కనుక క్లిక్ అయి ఉంటే త్రివిక్రమ్ గారి రైటింగ్ మరో స్థాయిలో ఉండేదని అనుకోవచ్చు. వీటితోపాటు నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆపద్భాందవుడు" అంటూ ట్వీట్ చేశారు.
నాగ్ అశ్విన్ ప్రస్తావించిన సినిమాల్లో కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ ఎందుకో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపలేకపోయాయి. ముఖ్యంగా 'ఖలేజా' సినిమా చూస్తే ఈ సినిమా ఎందుకు ఆ రేంజ్ లో డిజాస్టర్ అయిందని అనుమానం రావడం ఖాయం. మరీ అంత ఫ్లాప్ కావాల్సిన కంటెంట్ కాదు. ఒక కార్పోరేట్ కంపెనీలు ఒక గ్రామాన్ని సమూలంగా నాశనం చేసేందుకు నిర్ణయించుకుంటే ఎలా ముందుకెళ్తాయి అనే పాయింట్ అప్పటికి కొత్తదే. ఆ సినిమా కనుక హిట్ అయి ఉంటే త్రివిక్రమ్ అలాంటి కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేవారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకేనేమో అప్పటి నుంచి గురూజీ పెద్దగా రిస్క్ తీసుకోవడం లేదు. ఆయన సినిమాలు ఒక ఎంటర్టైనర్ ఫార్మాట్ ను దాటి బయటకు రావడం లేదు. ప్రయోగాలకు ఆమడ దూరంగా ఉంటున్నాడు. మరి నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా ఖలేజా గురించి ప్రస్తావించిన మాటకు అర్థం ఇదేనేమో!