Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురు ఒకే మాట..ఒకే బాట‌..ఇదే స‌త్యం!

By:  Tupaki Desk   |   8 Dec 2022 5:41 AM GMT
ఆ న‌లుగురు ఒకే మాట..ఒకే బాట‌..ఇదే స‌త్యం!
X
ప్ర‌స్తుతం థియేట‌ర్ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌లో ఎన్నో మార్పులొచ్చిన సంగ‌తి తెలిసిందే. పంపిణీ రంగంలో అగ్ర‌గామిగా ఉన్న‌వారో? నిర్మాత‌లో సొంతంగా థియేట‌ర్ల‌ను నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించి ప్ర‌త్యేక చైన్ వ్య‌వ‌స్థ అనేది ఒక‌టుంది. ఒక‌ప్ప‌టి వ్య‌వ‌స్థ ఇందుకు భిన్నంగా ఉండేది. థియేట‌ర్ నిర్వ‌హ‌కుడు ఒక‌రు..పంపిణీదారులు వేరుగా..బ‌య్య‌ర్లు వేరుగా ఉండేవారు.

పాక్షికంగా అక్క‌డ‌క్క‌డా ఇప్ప‌టికీ క‌నిపించినా చాలా థియేట‌ర్లు మూత ప‌డ‌టంతో ఈ విధానం క‌నుమ‌రుగ‌వుతోంది. సినిమా బిజినెస్ అనేది పూర్తిగా ఇండస్ర్టీతోనే ముడిప‌డిపోయింది. ఈ క్ర‌మంలో థియేట‌ర్లు ఫంక్ష‌న్ హాల్స్ గాను మారిపోయాయి. థియేట‌ర్ లో సినిమాకి ఆద‌ర‌ణ అంతంత మాత్రంగా ఉండ‌టం స‌హా నిర్వ‌హ‌ణ భారం కావ‌డంతో నిర్మాణ వ్య‌వ‌స్థ‌లో ఎన్నో మార్పులొ చ్చాయి.

తాజాగా థియేట‌ర్ స‌మ‌స్య‌లు త‌లెత్తిన నేప‌థ్యంలో ఆ న‌లుగురు చేతిల్లోనే థియేట‌ర్లు లాక్ అవుతున్నాయని నేరుగా కొంత‌మంది అగ్ర నిర్మాత‌లే సీన్ లోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వీటిపై ఓ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ విధానం ఎలా ఉందో వివరించారు. అలాగే సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల నిర్మాతలకు గొడవలు లేకపోయినా నిర్మాతల మండలి సమస్య ఏంటని ప్రశ్నించారు. ఇదే త‌రహాలోనే నిర్మాత‌లు అల్లు అరవింద్ సురేష్ బాబు కూడా ఇలాంటి అభిప్రాయాల్నే వ్య‌క్త ప‌రిచార‌ని గుర్తు చేసారు.

'థియేటర్లు వ్య‌వ‌స్థ క్షీణించిన ద‌శ‌లో...సినిమా వ్యాపారం తగ్గుతున్నప్పుడు మేము థియేటర్లను తీసుకొని ప్రేక్షకుల అవసరాలకు అనుగుణంగా వాటిని మార్పు చేసాం. ఎన్నో థియేట‌ర్ల‌ను సొంతంగా తీసుకుని రెన్నో వేష‌న్ చేసాం. ఈ క్ర‌మంలోనే చాలా థియేట‌ర్ల‌ను మేము సొంతంగా క‌లిగి ఉన్నాం. కొన్ని థియేట‌ర్ల‌ను లీజుకు తీసుకున్నాం. కాబట్టి మాకు థియేటర్లు ఉన్నాయని నిందించడం తప్పు అవుతుంద‌ని' అభిప్రాయ‌ప‌డ్డారు.

సంక్రాంతికి పెద్ద సినిమాలకు ఇచ్చే థియేటర్ల గురించి సురేష్ బాబు ని ప్ర‌శ్నించ‌గా ఆయ‌నా ఆసక్తికర వ్యాఖ్య‌లు చేసారు. 'నా ప్రొడక్షన్ వెంచర్స్‌కి నైజాంలో థియేటర్లు దొరికేవి కావు. అప్పుడే థియేటర్లు నేను సొంతంగా సంపాదించడం మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా పెద్ద సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లతో ఉన్న సంబంధాల ఆధారంగా థియేటర్లు లభిస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో సినిమాలకు థియేట‌ర్లు దొర‌క‌డం ఇప్ప‌టికీ క‌ష్టంగానే ఉంటుంది. ఆ కార‌ణంగా కొంతమంది మమ్మల్ని నిందిస్తారు. కానీ నేను దాని గురించి పెద్గ‌గా ప‌ట్టించుకోను ' అని అన్నారు. ఆ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి ఆ ముగ్గురు ఒకే గొడుగు కింద ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిర్మాతల మండలిలో త‌లెత్తిన వివాదం నేప‌థ్యంలో సమాధానమిచ్చే విషయంలో అరవింద్.. రాజుగారు.. సురేష్ బాబు సహా అగ్ర నిర్మాత‌లంతా ఒకే మాట మీద ఉన్న‌ట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.