Begin typing your search above and press return to search.
`భీమ్లా నాయక్` కోసం ఆ రెండు డేట్ లు ఫైనల్
By: Tupaki Desk | 28 Jan 2022 2:30 PM GMTఓమిక్రాన్, కరోనా థర్డ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో చాలా వరకు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని విధించాయి కూడా. కొన్ని రాష్ట్రాలు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో చాలా వరకు దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన భారీ చిత్రాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో చాలా వరకు బిగ్ టికెట్ సినిమాల రిలీజ్ లు వాయదా పడ్డాయి. సంక్రాంతికి అత్యంత భారీ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద హంగామా చేయాలని భావించిన `ఆర్ ఆర్ ఆర్`, ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` చిత్రాలు అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
జనవరి 7న `ఆర్ ఆర్ ఆర్` విడుదల కావాల్సింది. 14న న`రాధేశ్యామ్` విడుదల కు ప్లాన్ చేశారు. అయితే ఈ రెండింటి మధ్యలో అంటే జనవరి 12న `భీమ్లా నాయక్` ని రంగంలోకి దింపాలని నిర్మాత ప్లాన్ చేశారు. కానీ రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య `భీమ్లా నాయక్` పోటీ ఎందుకని ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ నుంచి బలవంతంగా తప్పించారు. దీంతో ఈ మూవీని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
అయితే తాజాగా `ఆర్ ఆర్ ఆర్` మార్చి 18న లేదా, ఏప్రిల్ 28న థియేటర్లలోకి తీసుకొస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. ఇదే తరహాలో `రాధేశ్యామ్` ని మార్చి ఫస్ట్ వీకెండ్ లో శుక్రవారం లేడా సెకండ్ వీకెండ్ లో శుక్రవారం రిలీజ్ చేయాలని, అదీ కుదరని పక్షంలో ఏప్రిల్ ఫస్ట్ వీకెండ్ లో శుక్రవారం లేడా సెకండ్ వీకెండ్ లో శుక్రవారం రిలీజ్ చేయాలని, ప్లాన్ చేస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు `భీమ్లా నాయక్` కోసం రెండు రిలీజ్ డేట్ లని మేకర్స్ అనుకుంటున్నారని తెలిసింది.
ముందు చెప్పినట్టుగా ఫిబ్రవరి 25న కాకుండా మార్చి 25న ఈ మూవీని రిలీజ్ చేయాలని అలా కుదరని పక్షంలో ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ రిలీజ్ డేట్ ఏ సినిమాకు అడ్డంకిగా మారనుందా అని అంతా ఆరాతీస్తున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రావాలనుకున్న `సర్కారు వారి పాట` కూడా మారడంతో `భీమ్లా నాయక్` ని ఆ డేట్ కి ఫిక్స్ చేసే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్.
మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుయ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. కీలక పాత్రల్లో పవన్ కల్యాణ్ , రానా నటించారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇటీవల ఈ మూవీ నుంచి లీక్ అయిన విజువల్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.