Begin typing your search above and press return to search.
బన్నీ జీవితంలో రెండు రాత్రులు
By: Tupaki Desk | 7 Jan 2020 4:26 AM GMTవిజయం ఆత్మవిశ్వాసం పెంచితే.. ఫెయిల్యూర్ మనిషిలో చాలా మార్పును తీసుకొస్తుంది. కొందరిలో ఆత్మన్యూనతను పెంచితే మరికొందరిలో మాత్రం తనను తాను సరి చేసుకునేందుకు లభించిన అవకాశంగా భావించి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. దగ్గర దగ్గర ఇరవై నెలలుగా బన్నీ సినిమాలేమీ రాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో.
సినిమా వేడుకల్లో మాట్లాడే హీరోలు తమకు లభించిన సమయాన్ని తాను చేసిన సినిమా గురించి చెప్పి.. దానికి మరింత బజ్ వచ్చేందుకు వీలుగా మాట్లాడతారు. వారి స్పీచ్ మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. ఇందుకు మినహాయింపుగా అల్లు అర్జున్ ను చెప్పాలి. తన సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లో తాను చేసిన సినిమాల గురించి మాత్రమే కాదు.. తన మనసు మీద పడిన ముద్రల గురించి కూడా మాట్లాడతాడు.
అలాంటి తత్త్వమే సుమారు నాలుగేళ్ల క్రితం సరైనోడు ఫంక్షన్ లో పవన్ ను గురించి మాట్లాడాలని కొందరు అడిగితే.. ‘చెప్పను బ్రదర్’ అంటూ భారీ క్లాస్ పీకటమే కాదు.. తనలోపలి ఆవేశాన్ని ప్రదర్శించి హాట్ టాపిక్ అయ్యారు. పెను సంచలనంగా మారారు. ఆ రాత్రి బన్నీ నోటి నుంచి వచ్చిన మాటలు.. అతని ఇమేజ్ మీద చాలానే ప్రభావాన్ని చూపించాయి. పవన్ ఫ్యాన్స్ బన్నీకి దూరమయ్యేలా చేశాయి. తర్వాతి కాలంలో తన మాటల్నికాస్త కరెక్ట్ చేసినా.. అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన చెప్పను బ్రదర్ మాట మీద సాగిన చర్చ.. రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి.
అలా ఒక రాత్రి వేళ తాను మాట్లాడిన మాటలు బన్నీ ఇమేజ్ మీద చాలానే ప్రభావం చూపించాయి. కట్ చేస్తే.. తాజాగా అల వైకుంఠపురము చిత్ర మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో అతను చేసిన తాజా వ్యాఖ్యలు బన్నీని మరో స్థాయికి తీసుకెళ్లటమే కాదు.. అతని మీద అభిమానాన్ని మరింత పెంచేలా చేశాయి. ఇప్పటివరకూ అల్లు అర్జున్ మీద ఎలాంటి అభిప్రాయం లేనోళ్లకు సైతం.. అతన్ని ఫలానా యాంగిల్ లో ఇష్టపడొచ్చన్న ఫీల్ కలిగేలా చేశారు. తన మాటలతో రాత్రికి రాత్రి తన ఇమేజ్ మొత్తాన్ని ఛేంజ్ చేసుకోవటమే కాదు..అరే.. ఇలాంటి కొడుకు ఉంటే చాలన్న భావన కలిగేలా చేయటమే కాదు.. ఇలాంటి మొగడు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకునేలా.. చేశాడని చెప్పాలి. నిజానికి తాజా ప్రోగ్రాంలో తను నటించిన సినిమాను ప్రమోట్ చేసుకునే కంటే.. తనను తాను అందరికి అర్థమయ్యేలా చెప్పుకున్నారు అల్లు అర్జున్.
మొత్తంగా చూస్తే.. అల్లు అర్జున్ జీవితంలో (పబ్లిక్ కోణంలో చూసినప్పుడు సుమా) రెండు రాత్రులనుకుంటే.. ఒక రాత్రి వేళ తన మాటలతో అప్పటివరకూ తనను అభిమానించే వారిలో కొందరిని దూరం చేసుకుంటే.. నిన్న (సోమవారం) రాత్రి తన మాటలతో తనకు దూరంగా ఉన్నోళ్ల మనసుల్ని సైతం దోచేశారు. బన్నీకి కొత్త ఇమేజ్ తేవటంలో రెండు రాత్రులు కీలకమని చెప్పక తప్పదు.