Begin typing your search above and press return to search.
బాలీవుడ్ హీరోలకు ధీటుగా ఆ రెండు సినిమాలు
By: Tupaki Desk | 30 Jun 2022 2:30 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు మెల్లగా వారి మార్కెట్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసుకుంటున్నారు. ఇంతకుముందు అగ్ర హీరోలుగా ఉన్న బాలీవుడ్ హీరోలతో సమానంగా ఏ మాత్రం తీసిపోని విధంగా మన హీరోలు ముందుకు కొనసాగుతున్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ హీరోల సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునేవి. ఇక ఇప్పుడు వారితో సమానంగా టాలీవుడ్ హీరోలు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ అందుకుంటూ వస్తున్నారు.
ఇటీవలకాలంలో నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీసు వద్ద ఆశ్చర్యపరిచే విధంగా ఏ హీరో కూడా సక్సెస్ అందుకోలేకపోయాడు. చాలావరకు సినిమాలో ఓపెనింగ్స్ లోనే చతికిల పడ్డాయి. ఇక మిగతా పాన్ ఇండియా సినిమాలు మాత్రం భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. ఇక రాబోయే రోజుల్లో మాత్రం బాలీవుడ్ లో అసలైన సినిమాలు రాబోతున్నాయి.
అందరి ఫోకస్ అయితే 2023 సినిమాల పైనే ఉన్నాయి. ముఖ్యంగా షారుక్ ఖాన్ పటన్, సల్మాన్ ఖాన్ టైగర్ 3, రణ్బీర్ కపూర్ ఎనిమల్, హృతిక్ రోషన్ ఫైటర్ అలాగే షారుక్ అట్లీ కలయికలో రానున్న జవాన్ సినిమా కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నాయి.
అయితే 2023 లో వచ్చే సినిమాలలో బాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా 2 తెలుగు సినిమాలు మాత్రం దాదాపు 40 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకునే అవకాశం అయితే ఉంది.
అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ తో పాటు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈజీగా అక్కడి స్టార్ హీరోల రేంజిలో ఓపెనింగ్స్ అందుకుంటాయి అని చెప్పవచ్చు. ఇక ప్రతి ఏడాది కూడా బాలీవుడ్ లోనే అత్యధికంగా బిజినెస్ జరిగుతుండగా 2022లో మాత్రం టాలీవుడ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ ఏడాది మిడిల్ లోనే టాలీవుడ్ లోనే దాదాపు 1800 కోట్ల బిజినెస్ జరిగింది. కాబట్టి 2023లో అంతకంటే ఎక్కువ స్థాయిలో బాలీవుడ్ కంటే ఎక్కువగా టాలీవుడ్ డామినేట్ చేసే అవకాశం ఉంది.