Begin typing your search above and press return to search.
మణిరత్నంని టెన్షన్ పెడుతున్న ఆ ఇద్దరు!
By: Tupaki Desk | 10 Sep 2022 6:18 AM GMTమణిరత్నం గత 30 ఏళ్లుగా ఎన్నో అవాంతరాల్ని అధిగమిస్తూ ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' ని తెరపైకి తీసుకొచ్చాడు. అప్పట్లో కమల్, రజనీకాంత్ లతో.. ఆ తరువాత మహేష్ బాబు, విజయ్ లతో ఈ మూవీని పట్టాలెక్కించాలని ప్రయత్నాలు చేసి చివరికి ఫైనాన్షియర్లు హ్యాండ్ ఇవ్వడంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రయత్రాలని పక్కన పెట్టారు. చివరికి లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా సుభాస్కరన్ ముందుకు రావడంతో 30 ఏళ్లుగా కలలు కంటున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎట్టకేలకు తెరపైకి తీసుకొచ్చారు మణిరత్నం.
రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1'ని సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కనీ వినీ ఎరుగని స్టార్ట్ కాస్ట్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ చాలా కాలం తరువాత మణిరత్నం తో కలిసి వర్క్ చేసిన సినిమా కావడం, అందుకు తగ్గ గ్రాండీయర్ లుక్ తో సినిమా వుండటం, దాన్ని ఎలివేట్ చేసే రేంజ్ లో రెహమాన్ సంగీతం వుండటంతో ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
సినిమా మేకింగ్ కోసం మణిరత్నం ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి మొత్తానికి పూర్తి చేస్తూ ఈ మూవీ రిలీజ్ సమయంలో ఇద్దరు మణిరత్నంని టెన్షన్ కు గురిచేస్తుండటం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఆ ఇద్దరు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కోలీవుడ్ హీరో ధనుష్. హృతిక్ రోషన్ సెప్టెంబర్ 30న 'విక్రమ్ వేద'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ ఆధారంగా పుష్కర్ -గాయత్రి హిందీలో తమిళ మాతృకని మించి ఈ మూవీని అత్యంత పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.
టీజర్ నుంచే పాజిటివ్ వైబ్స్ ని రేకెత్తిస్తున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ తో బాలీవుడ్ కి ఈ మూవీతో కొత్త ఊపు వస్తందనే సంకేతాల్ని అందించింది. చాలా రోజుల తరువాత హృతిక్ రోషన్ టెర్రిఫిక్ క్యారెక్టర్ లో నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై అటు ఉత్తరాదిలోనూ, ఇటు దక్షిణాదిలోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. అంతే కాకుండా ఉత్తరాదిలో భారీగా బిజినెస్ జరుగుతోంది. తమిళ మాతృకని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు పెద్దగా చూడకపోవడం ఈ మూవీకి మరింత అడ్వాంటేజీగా మారింది.
ఇది ఇప్పుడు మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్ 1' కు పెద్ద తలనొప్పిగా మారిందట. ఉత్తరాదిలో నేటివిటీ మిస్సవుతుంది కాబట్టి జనం 'విక్రమ్ వేదా'కే సై అంటారు. దాంతో తీవ్ర ఇబ్బందులు 'పొన్నియిన్ సెల్వన్ 1' కు తప్పవన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇక ఇదే రోజున ధనుష్ నటించిన 'నానే వరువేన్' రిలీజ్ అవుతోంది. సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై కూడా భారీ అంచనాలే వున్నాయి.
రీసెంట్ గా ధనుష్ నటించిన 'తిరు' వంద కోట్ల క్లబ్ లో చేరడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. వారం దాటితే చిరు 'గాడ్ ఫాదర్'తో, నాగ్ 'ది ఘోస్ట్'తో రంగంలోకి దిగబోతున్నారు. 'గాడ్ ఫాదర్'తో పోలిస్తే నాగ్ 'ది ఘోస్ట్'పైనే అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మణిరత్నం కు ఇబ్బందికరంగా మారుతున్నాయని తెలుస్తోంది. ఇంత పోటీలో 'పొన్నియిన్ సెల్వన్ 1' గట్టెక్కాలంటే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాల్సిందేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.