Begin typing your search above and press return to search.

పెళ్లికి వచ్చిన వారు కూడా నన్ను విమర్శించారు

By:  Tupaki Desk   |   1 Dec 2022 6:30 AM GMT
పెళ్లికి వచ్చిన వారు కూడా నన్ను విమర్శించారు
X
తమిళ్‌ లవ్‌ బర్డ్స్ మంజిమా మోహన్‌.. గౌతమ్ కార్తిక్‌ లు పెళ్లి బంధం తో ఒక్కటి అయ్యారు. బంధు మిత్రులు మరియు సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది. గత మూడు సంవత్సరాల ప్రేమ బంధంను పెళ్లి బంధంగా మార్చుకున్న ఈ లవ్‌ బర్డ్స్ యొక్క ఫెళ్లి ఫొటోలు మరియు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సమయంలోనే మంజిమా మోహన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి.

గత కొన్నాళ్లుగా మంజిమా మోహన్ యొక్క బరువు గురించి సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మంజిమా మోహన్‌ బరువు తగ్గాలి అంటూ చాలా మంది అంటూ ఉంటారు. గౌతమ్ కార్తిక్ తో పోల్చితే మంజిమా కాస్త లావుగా ఉంది అంటూ పెళ్లి ఫొటోలను చాలా మంది ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ పై మంజిమా స్పందించింది.

మంజిమా పెళ్లి తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో... తన బరువును ట్రోల్స్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. సోషల్‌ మీడియాలోనే కాకుండా నా పెళ్లికి వచ్చిన వారు కూడా నన్ను చూసి విమర్శించారు. నా బరువు గురించి.. నేను లావుగా ఉండటం గురించి అక్కడ మాట్లాడుకోవడం నాకు తెలుసు అన్నట్లుగా మంజిమా పేర్కొంది.

పెళ్లిలో కూడా తనను విమర్శించారు అంటూ చెప్పిన మంజిమా తాను మాత్రం ఫీల్‌ అవ్వడం లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను చాలా ఫిట్‌ గా ఉన్నాను అని.. తన గురించి ఎవరు బాధ పడాల్సిన పని లేదు అన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. తాను బరువు తగ్గాలి అనుకున్నప్పుడు తప్పకుండా తగ్గుతాను అంది. పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగబోతున్నట్లుగా పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.