Begin typing your search above and press return to search.

పాయల్ 'అనగనగా ఓ అతిథి' మెప్పించిందా..?

By:  Tupaki Desk   |   21 Nov 2020 9:10 AM GMT
పాయల్ అనగనగా ఓ అతిథి మెప్పించిందా..?
X
తెలుగులో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ మరియు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'ఆహా' లో మరో వైవిధ్యభరితమైన మూవీ రిలీజ్ అయింది. పాయల్‌ రాజ్‌ పుత్‌ - చైతన్య కృష్ణ ప్రధాన ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్ ''అనగనగా ఓ అతిథి'' నవంబర్ 20న విడుదలైంది. కన్నడ దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ట్రెండ్ లౌడ్ బ్యానర్ పై రాజా రామామూర్తి - చిందబర్‌ నటీశన్‌ నిర్మించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తిని కలిగించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ విషయానికొస్తే పేదరికంలో నివస్తున్న మల్లిక(పాయల్ రాజ్ పుత్) కుటుంబంలోకి అనుకోని ఓ అతిథి(కృష్ణ చైతన్య) వచ్చిన తరువాత వారికి ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్ర కథ నడిచింది. దురాశ - కామం - అత్యాశ వంటి వాటికి ఎమోషనల్ డ్రామాను కలిపి ఊహించని మలుపులతో సాగిన ఈ పాత్రలు చివరకు ఎలా ముగిశాయి? ఇంతకీ అతిధికి మల్లిక కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది మిగిలిన కథ.

డబ్బు పై ఆశతో జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారనే కాన్సెప్ట్ ని దయాల్‌ పద్మనాభన్‌ ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను తీసుకుని, స్క్రీన్ మీద ఇంట్రస్టింగ్ గా మలచడంలో దర్శకత్వ ప్రతిభ కనబరిచారు. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాని మలిచారు. పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన పాయల్.. తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పవచ్చు. చైతన్య కృష్ణ కూడా బాగానే నటించాడు. అలాగే ఆనంద్‌ చక్రపాణి - వీణ సుందర్ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కొన్ని సన్నివేశాలను విజవల్ గా ఆకట్టుకునేలా రాకేష్ బి. సినిమాటోగ్రఫీ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ అరోల్ కొరెల్లి నేపథ్య సంగీతం థ్రిల్ ని గురి చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వలేదనిపించాయి.

కాకపోతే ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం.. సస్పెన్స్ కి గురి చేసే అంశాలు పెద్దగా లేకపోవడం.. మిగతా ప్రధాన పాత్రలు సరిగ్గా కనెక్ట్ కాకపోవడం సినిమాకి మైనస్ గా మారాయి. ఇక రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చనే భావన కలుగుతుంది. మొత్తం మీద ''అనగనగా ఓ అతిథి'' సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు.. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.