Begin typing your search above and press return to search.
పవన్ వద్దకు వెళ్లాలనుకున్న 'ఒక్కడు'
By: Tupaki Desk | 11 Aug 2021 5:52 AM GMTప్రిన్స్ మహేష్ బాబును సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమాల్లో 'ఒక్కడు' సినిమా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. టక్కరి దొంగ మరియు బాబీ వంటి డిజాస్టర్స్ తర్వాత కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ బాబు వద్దకు దర్శకుడు గుణశేఖర్ ఒక్కడు సినిమా కథతో వెళ్లాడట. కథ వింటున్నంత సమయం బాగుందన్నట్లుగానే మహేష్ బాబు రియాక్షన్ ఉందట. మొత్తం కథ విన్న తర్వాత కూడా చాలా బాగుందన్నాడట. కాని సినిమా చేసే విషయమై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని గుణశేఖర్ ఆరాట పడుతున్న సమయంలో మహేష్ బాబు నుండి స్పందన లేదట. మేనేజర్ కు కాల్ చేస్తే సరైన స్పందన లేదు.. డైరెక్ట్ గా మహేష్ బాబుకు చేసినా కూడా ఫోన్ ఎత్తలేదట. దాంతో కథను మరో హీరో వద్దకు తీసుకు వెళ్లేందుకు గుణశేఖర్ ప్రయత్నాలు చేశారంటూ తాజా ఇంటర్వ్యూలో తోట ప్రసాద్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. మహేష్ బాబు నుండి రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన రాలేదు.. సంప్రదించేందుకు ప్రయత్నించినా కూడా గుణశేఖర్ కు రిప్లై ఇవ్వలేదు. మేనేజర్ పలు సార్లు ఫోన్ ఎత్తి బాబు పడుకున్నాడని.. బిజీగా ఉన్నాడని సమాధానం చెప్పాడు కాని మాట్లాడించలేదు. దాంతో మహేష్ కు ఒక్కడు కథపై ఆసక్తి లేనట్లుగా ఉందని భావించి గుణశేఖర్ మరో హీరోతో సినిమాను ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్ ను టైమ్ అడిగి కథ చెప్పేందుకు సిద్దం అయ్యాడు. పవన్ నుండి సరైన స్పందన లేకుంటే వెంకటేష్ తో ఒక్కడును తెరకెక్కించాలని గుణశేఖర్ భావించారట. అలా ఒక్కడు కథ మహేష్ బాబు నో చెప్పి ఉంటే అలా అలా వెళ్లి ఉండేది. మహేష్ బాబు నుండి కాస్త ఆలస్యంగా స్పందన రావడంతో ఒక్కడు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.
ఒక్కడు కథ రాసుకున్న సమయంలో ఓబుల్ రెడ్డి పాత్రకు గాను గోపీచంద్ ను అనుకున్నాము. కాని అప్పటికే మహేష్ బాబు నిజం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటిస్తున్నాడు. కనుక ఆయన్ను కాకుండా ఒక్కడులో ప్రకాష్ రాజ్ ను తీసుకోవడం జరిగింది. ఎంఎస్ రాజు అప్పట్లోనే 13 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. అప్పటి వరకు మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాధ్యం కాని వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంది. బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం ఒక్కడు సినిమా అప్పట్లో 32 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.
మహేష్ బాబుకు ఒక్కడు సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడటంతో గుణశేఖర్ పై ఆయనకు చాలా అభిమానం ఏర్పడింది. అందుకే ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను మహేష్ బాబు గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన విషయం తెల్సిందే. ఒక్కడు సినిమా వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా టీవీలో వస్తూ ఉంటే ఈతరం ప్రేక్షకులు కూడా టీవీలకు అలా అతుక్కు పోయి చూస్తున్నారు. ఆ సమయంలో మహేష్ బాబు అతిగా ఆలోచించి ఒక్కడును వదులుకుని ఉంటే కెరీర్ లో బిగ్ ఛాన్స్ ను మిస్ చేసుకునే వారు. అలా చాలా మంది హీరోలు చాలా పెద్ద సినిమాలు వదులుకున్న సందర్బాలు ఉన్నాయి.