Begin typing your search above and press return to search.
కెమేరామ్యాన్ ని వణికించిన అర్జున్ రెడ్డి
By: Tupaki Desk | 6 Sep 2017 5:56 AM GMTఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలామందికే పేరు వస్తుంది. భారీ సినిమాలు ఆడితే హీరో.. డైరెక్టర్ లే క్రెడిట్ పట్టుకుపోతారు. కానీ చిన్ని సినిమా ఆడిందంటే మాత్రం.. ఆ ప్రాజెక్టుకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు లభిస్తుంది. అర్జున్ రెడ్డి విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.
హీరో.. దర్శకుడు.. హీరోయిన్.. నిర్మాత తర్వాత తన వర్క్ కు ప్రశంసలు అందుకుంటున్నాడు సినిమాటోగ్రాఫర్ తోట రాజు. ముందు నుంచి సినిమా నేపథ్యం ఉన్నా.. కెమేరా ఫీల్డ్ తో సంబంధం లేదు. మేకప్ మ్యాన్ వెంకట్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు తోట రాజు. "మోహన్ బాబు గారికి మా నాన్న వెంకట్ మేకవ్ వర్క్ చేసేవారు. సెలవల్లో నేను కూడా షూటింగ్ కి వచ్చేవాడిని. అప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెరిగింది" అన్న రాజు.. సినిమాటోగ్రఫీ ఎంచుకోవడానికి చెప్పిన రీజన్ భలేగా ఉంది. "షూటింగ్ లలో హీరో.. డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్.. వీళ్లు మాత్రమే ఎప్పుడూ బిజీగా పరుగులు పెడుతూ ఉంటారు. బాగా ఆలోచించుకుని.. చివరకు సినిమాటోగ్రఫీ ఎంచుకున్నా" అని చెప్పాడు తోట రాజు.
సినిమాటోగ్రాఫర్ సురేందర్ రెడ్డి దగ్గర చేరడం.. ఆ తర్వాత మోహన్ కృష్ణ దగ్గర శిష్యరికం.. బాలీవుడ్ ఇష్క్.. రాజ్ కుమార్ చిత్రాలకు సెకండ్ యూనిట్ కెమేరామ్యాన్ గా వర్క్ చేశాడు రాజు. పెళ్లి చూపులు సహా పలు సినిమాలకు క్లాష్ వర్క్ కూడా చేశాడట. అంటే.. అసలు సినిమాటోగ్రాఫర్ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.. మరో జూనియర్ సినిమాటోగ్రాఫర్ తో దర్శకుడు షూటింగ్ కంటిన్యూ చేయడమే క్లాష్ వర్క్.
అర్జున్ రెడ్డికి సినిమాటోగ్రఫీ చేసే అవకాశాన్ని విజయ్ దేవరకొండ ఇప్పించాడట. "ఈ సినిమాలో అంత లైవ్లీగా అనిపించడానికి కారణం.. లెంగ్తీగా షూట్ చేయడమే. ఒక్కో సీన్ ను 7-8 నిమిషాల పాటు పిక్చరైజ్ చేసేవాళ్లం. ఒరిజినల్ గా అనిపించేందుకు.. భుజాలపైనే కెమేరా మోసే వాడిని. 25 కిలోల కెమేరాను అంతసేపు మోసిన తర్వాత భుజాలు.. చేతులు వణికిపోయేవి" అంటున్నాడు తోట రాజు.