Begin typing your search above and press return to search.

ఇక రైటర్‌ నటుడిగానే కొనసాగుతాడట

By:  Tupaki Desk   |   9 Sep 2015 7:35 PM GMT
ఇక రైటర్‌ నటుడిగానే కొనసాగుతాడట
X
చిత్రం భళారే విచిత్రం - కలికాలం - అల్లరి అల్లుడు శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం.. ఇలా ఎన్నో సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు సీనియర్‌ రచయిత తోటపల్లి మధు. 30ఏళ్ల సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆయనది. లేటెస్టుగా సినిమా చూపిస్త మావ చిత్రంతో నటుడిగా పెద్ద హిట్‌ కొట్టారు. అప్పట్లో కొన్ని సినిమాల్లో విలనీ చేసిన ఆయన ఈ సినిమాలో మాత్రం రాజ్‌ తరుణ్‌ కి తండ్రి పాత్రలో వెరైటీ అప్పియన్స్‌ తో ఆకట్టుకున్నారు. ఈ సంతోష సమయాన ఆయన చెప్పిన సంగతులివి...

రచయితగా ఎన్నో విజయాలు అందుకున్నా. ఇప్పుడు నటుడిగానూ నిరూపించుకున్నా. ఈ చిత్రంలో నా మాడ్యులేషన్‌ అందరికీ నచ్చింది. దాసరి, చిరంజీవి లాంటి మహామహులే నన్ను ప్రశంసించారు. సరైన టైమింగులో హిట్‌ పడింది. వరుసగా ఛాన్సులొస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది.. అని అన్నారు. 19ఏళ్ల వయసులోనే పరిశ్రమలో అడుగుపెట్టా. 190 సినిమాలకు రచయితగా పనిచేశాను. మహారథి సినిమా తర్వాత ఇక నటుడిగానే కొనసాగాలను రచనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేశా. కామెడీ, విలనీ, క్యారెక్టర్‌ ఏదైనా మెప్పించగలను. రచయితగా నెత్తిన పెట్టుకున్న ఈ పరిశ్రమ నటుడిగానూ నన్ను ఆదరిస్తుందని అనుకుంటున్నాని అన్నారు.