Begin typing your search above and press return to search.

పన్నులు తగ్గించమంటున్న హీరో

By:  Tupaki Desk   |   16 Aug 2016 9:30 AM GMT
పన్నులు తగ్గించమంటున్న హీరో
X
తెలుగు సినీ పరిశ్రమ రేంజ్ చాలా పెద్దది. బాలీవుడ్ తర్వాత అత్యధికంగా సినిమాలు తెరకెక్కేది టాలీవుడ్ లోనే. రాసి లోనే కాదు.. వాసిలో కూడా టాలీవుడ్ కి మంచి రికార్డే ఉంది. వసూళ్లలో కూడా బాలీవుడ్ తో పోటీపడగల స్థాయి తెలుగు సినిమాది మాత్రమే. అయితే.. ఇక్కడి ఇండస్ట్రీని విపరీతంగా దెబ్బ తీస్తున్న అంశాల్లో వినోదపు పన్ను కూడా ఒకటి అంటారు సినీ జనాలు.

యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన తౌఫీక్ ఖాన్.. తెలుగులో సినిమాలపై విధిస్తున్న పన్ను తగ్గించాలంటూ మొరపెట్టుకుంటున్నాడు. అయితే.. ఈయన టాలీవుడ్ తరఫున ఈ రిక్వెస్ట్ చేయలేదు. డెక్కన్ ఫిలిం సొసైటీ తరఫున పలు భాషల్లో సినిమాలు తెరకెక్కించే వారితో కూడిన ఓ స్పెషల్ యూనియన్ ఈయనది. ఇప్పటికే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీని.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ ను కలిసి.. ఈ విషయంలో వినతి పత్రాలు సమర్పించాడు. సినిమా రంగం నిలబడాలంటే.. పన్ను భారం నుంచి పూర్తిగా మినహాయింపును ఇవ్వాలని కూడా అభ్యర్థించాడట.

'మంత్రులు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మేము టాలీవుడ్ సినిమాలతో సమానంగా బెనిఫిట్స్ పొందబోతున్నాం. ప్రస్తుతం నేను నటించి నిర్మించిన టైగర్ సుల్తాన్ థియేటర్లలో ఉంది. మొదటి వారం 15 థియేటర్లలో ప్రదర్శించగా.. రెండో వారం నుంచి మరో 20 థియేటర్లు పెరగనున్నాయి' అంటూ సినిమా సంగతులతో పాటు అటు పరిశ్రమ గురించి కూడా మొరపెట్టుకున్నా అంటున్నాడు తౌఫీక్ ఖాన్.