Begin typing your search above and press return to search.

ఊపిరి నిర్మాత‌కు షాక్‌

By:  Tupaki Desk   |   23 March 2016 1:15 PM GMT
ఊపిరి నిర్మాత‌కు షాక్‌
X
ఈ శుక్ర‌వారం తెలుగు - త‌మిళ భాష‌ల్లో ‘ఊపిరి’ సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తోంది పీవీపీ సంస్థ‌. ఈ స‌మ‌యంలో వారికి అనుకోని అవాంత‌రం ఎదురైంది. ‘ఊపిరి’ త‌మిళ వెర్ష‌న్ ‘తోళ’ విడుద‌ల ఆపేయాలంటూ ఓ త‌మిళ నిర్మాత చెన్నై సివిల్ కోర్టును ఆశ్ర‌యించాడు. ఆ నిర్మాత పేరు ఎన్‌.సుంద‌రేశ్వ‌ర‌న్‌. ఈయ‌న ఊపిరి త‌మిళ వెర్ష‌న్ కు తోళ అని పేరు పెట్ట‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాడు.

‘తోళ’ అంటే త‌మిళంలో స్నేహితుడా అని అర్థం. ఇదే పేరుతో సుంద‌రేశ్వ‌ర‌న్ 2008లో ఓ సినిమా తీశాడు. ప్రేమ్ జీ అమ‌ర‌న్‌, విజ‌య్ వ‌సంత్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఐతే మామూలుగా ఒక సినిమా వ‌చ్చిన ప‌ది సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ అదే పేరును ఇంకో సినిమాకు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆ లోపే అదే పేరుతో సినిమా తీయాలంటే నిర్మాత నుంచి అనుమ‌తి తీసుకోవాలి. ఐతే పీవీపీ సంస్థ త‌న నుంచి ప‌ర్మిష‌న్ తీసుకోలేద‌ని.. అందుకే ఈ సినిమా విడుద‌ల ఆపేయాల‌ని సుంద‌రేశ్వ‌ర‌న్ కోర్టును ఆశ్ర‌యించాడు.

చెన్నై సివిల్ కోర్టు సుంద‌రేశ్వ‌ర‌న్ పిటిష‌న్ ను విచార‌ణ‌కు కూడా స్వీక‌రించింది. గురువారం దీనిపై విచారించ‌నుంది. త‌మిళనాట పెద్ద సినిమాల రిలీజ్ కు ముందు ఇలాంటి వివాదాలు మామూలే. బ‌హుశా కోర్టు బ‌య‌టే సెటిల్మెంట్ చేసుకుని వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవ‌డానికి పీవీపీ సంస్థ ప్ర‌య‌త్నించే అవ‌కాశ‌ముంది.