Begin typing your search above and press return to search.
బాహుబలికి భయపడుతున్న బజరంగీ!!
By: Tupaki Desk | 12 July 2015 12:15 AM GMTబాహుబలి దెబ్బకి బాక్సాఫీస్‌లు ఒణికిపోతున్నాయి. సొంత భాష, పరభాష అనే తేడా లేదు. అన్నిచోట్లా ఒకటే ప్రభంజనం. ఇప్పటికే భారతదేశంలో నంబర్-1 సినిమాగా రికార్డులకెక్కింది. తొలిరోజు వసూళ్లు మొదలుకుని మునుముందు ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో అన్న చర్చ సాగుతోంది. ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ్‌లోనే కాదు అటు ఉత్తరాదినా ఓ ఊపు ఊపేస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
ఓ అనువాద చిత్రం నార్త్‌లో ఈ స్థాయి వసూళ్లు తెస్తోందంటే ఇది పెనుసంచలనమేనని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈనెల 17న రిలీజ్‌కి రెడీ అవుతున్న సల్మాన్ 'భజరంగి భైజాన్'పై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాదిన బాహుబలి థియేటర్ల సంఖ్య పెంచేందుకు రెడీ అవుతున్నారు. బీహార్ లాంటి చోట ఫ్లాప్ సినిమాలన్నీ తీసేసి బాహుబలి వేయడానికి సన్నద్ధమవుతున్నారు. మల్టీప్లెక్సులు, మాస్ థియేటర్లు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఖాళీ చేయించి మరీ బాహుబలి ప్రదర్శిస్తామని చెబుతున్నారు. అంతేనా రోజురోజుకి వసూళ్లు పెరిగేట్టే కనిపిస్తోంది. సల్మాన్ భజరంగి వచ్చినా దాన్ని ఆపేస్తామని చెబుతున్నారట.
అయితే సల్మాన్ లాంటి స్టార్‌కి ఈ సినిమా పోటీ అని అనకూడదు. ఇదొక సునామీ లాంటిదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. భజరంగిని ఉద్ధేశించి ఓ ఎగ్జిబిటర్ మాట్లాడుతూ.. రాబోయే బ్లాక్‌బస్టర్ హిట్‌ని నమ్మే కంటే ఇప్పటికే సర్టిఫికెట్ అందుకున్న బ్లాక్‌బస్టర్ హిట్‌ని నమ్మడమే ఉత్తమం. అందుకే బాహుబలి వసూళ్లు బావున్నంత కాలం థియేటర్ల నుంచి తొలగించే ప్రసక్తే లేదని హామీ ఇస్తున్నారు. ఆ లెక్కన భారీగా రిలీజ్‌కి రావాలనుకున్న సల్మాన్‌కి బాహుబలి ఓ బీభత్సమైన థ్రెట్..