Begin typing your search above and press return to search.
కమల్ నితిన్ లకు పెద్ద రిస్కే!
By: Tupaki Desk | 4 Aug 2018 11:09 AM GMTటాలీవుడ్ కు సంఖ్యా పరంగా ఆగస్ట్ బాగా కలిసి వస్తోంది. చిన్నా పెద్ద అన్ని కలిపి వారానికో ఐదు దాకా సినిమాల విడుదల ఉన్నాయి. మొన్న వచ్చిన వాటిలో మరీ బ్యాడ్ టాక్ దేనికీ రాకపోయినా గూఢచారి-చిలసౌ మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక వచ్చే వారం రిలీజ్ కాబోతున్న వాటిపై కూడా బాగానే ఆసక్తి నెలకొంది. కాకపోతే ట్రేడ్ తో సహా ప్రేక్షకుల్లో కూడా కొన్ని అనుమానాలను బట్టి చూస్తే ఫలితాల గురించి సందేహం రాక మానదు. ముందుగా 9న రాబోతున్న శ్రీనివాస కళ్యాణం మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో హైప్ ఉన్నప్పటికి ట్రైలర్ చూసాక పెళ్లి తంతు తప్ప బలమైన కథ ఉందా అనే డౌట్ మెదులుతోంది.
అసలే పెళ్లి సినిమాలకు టైం కలిసిరావడం లేదు. హ్యాపీ వెడ్డింగ్ తేడా కొట్టేయగా రెస్పాన్స్ చాలా బాగున్నా చిలసౌకు అది వసూళ్ల రూపంలో ఇంకా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో పెళ్లి తప్ప మరోమాట లేని శ్రీనివాస కళ్యాణం మీద డౌట్స్ రావడం సహజమే. దానికి తోడు టైటిల్ పాత ఫ్లేవర్ లో ఉండటంతో పాటు ఆడియోలో ఒకటి రెండు పాటలు తప్ప శతమానం భవతి రేంజ్ ఆల్బమ్ కాదని ఇప్పటికే గుసగుసలు ఉన్నాయి. ఇక కమల్ హాసన్ విశ్వరూపం పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. మరో వారం లోపే వస్తోందన్న వస్తోందన్న సందడి లేదు. దానికి తోడు సినిమా ఎలా ఉండబోతోంది కథ ఏంటి అనే అంచనా ట్రైలర్ లో స్పష్టంగా ఇచ్చేయడంతో రెండు గంటల నిడివి మాత్రమే ఉన్న విశ్వరూపం ఏ మేరకు మెప్పిస్తుందో చెప్పడం కష్టంగానే ఉంది. కమల్ స్వయంగా ప్రమోషన్ చేసినా అది సరిపోవడం లేదు. బయ్యర్లు కూడా ఆచితూచి బేరమాడి తీసుకున్నట్టు టాక్.
వరస రోజుల్లో రాబోతున్న ఈ రెండు క్రేజీ సినిమాలు ముసురుకున్న అనుమానాలన్నీ దాటుకుని విజయం సాధించడం పెద్ద సవాలే. పెళ్లి కాన్సెప్ట్ తో సినిమాలు ఆశించిన మేర ఆడకపోవడం శ్రీనివాస కళ్యాణంను టెన్షన్ పెడుతుండగా కాన్సెప్ట్ ముందే తెలిసిపోవడమే కాక స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో గూఢచారి మెప్పించడంతో పాటు అదే కోవలోకే కనిపించడం విశ్వరూపం 2కి మైనస్ గా మారుతోంది. మరి ఏది నిలుస్తుందో ఆగస్ట్ 10న తేలిపోతుంది.