Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు నటికి చంపుతామంటూ బెదిరింపులు

By:  Tupaki Desk   |   10 July 2021 9:42 AM IST
శ్రీమంతుడు నటికి చంపుతామంటూ బెదిరింపులు
X
తమిళం.. తెలుగు.. కన్నడం మరియు మలయాళంలో కూడా చిన్నా చితకా సినిమాలు చేస్తూ కెరీర్‌ ను నెట్టుకు వస్తున్న తమిళ ముద్దుగుమ్మ సనమ్ శెట్టి పోలీసులను ఆశ్రయించింది. గత కొన్ని నెలలుగా ఒక వ్యక్తి తనను బెదిరిస్తున్నాడు అంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మొదట సోషల్‌ మీడియాలో బ్యాడ్‌ కామెంట్స్ పెడుతున్న సమయంలో లైట్‌ తీసుకున్నాను. కాని అతడు ఇటీవల నా ఫోన్‌ నెంబర్‌ ను తెలుసుకుని వేదిస్తున్నాడు. నా తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదిరించడంతో పాటు వారి గురించి ఆరా తీస్తున్నట్లుగా కూడా ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గత కొన్నాళ్లు అతడి వల్ల పడుతున్న మానసిక వేదన తగ్గించాలంటూ పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్‌ నెంబర్‌ మరియు ఇతర ఆధారాల ద్వారా ట్రేస్‌ చేసి పట్టుకున్నారు. అతడిని రాయ్‌ జాన్‌ పాల్ గా గుర్తించారు. సనమ్‌ శెట్టి పై అభిమానంతో అతడు ఇలా వేదింపులకు పాల్పడి ఉంటాడని వారు భావిస్తున్నారు. ప్రస్తుతానికి విచారణ జరుగుతుందని.. కొన్ని రోజుల్లో అతడి గురించి పూర్తి సమాచారం రాబట్టి అతడి వెనుక ఉద్దేశ్యం ఏంటీ అనే విషయాన్ని గుర్తిస్తామని పేర్కొన్నారు. హీరోయిన్‌ ను బెదిరించిన కేసులో రాయ్ జాన్ పాల్‌ ఒక్కడేనా ముఠా ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుందట. గతంలో ఇతడి నేర ప్రవృత్తిని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇన్నాళ్లుగా మానసికంగా వేదిస్తున్న వ్యక్తి అరెస్ట్‌ అవ్వడంతో సనమ్‌ శెట్టి కాస్త రిలాక్స్ అయ్యింది. 2012 సంవత్సరంలో తమిళ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు తెలుగు లో మొదటగా శ్రీమంతుడు సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత తెలుగు లో సంపూర్నేష్‌ బాబు హీరోగా నటించిన సింగం 123 సినిమా లో హీరోయిన్ గా నటించింది. 2016 లో వచ్చిన ప్రేమికుడు లో కూడా ఈమె నటించింది. ప్రస్తుతం వరుసగా తమిళ చిత్రాల్లో నటిస్తున్న సనమ్‌ శెట్టి ముందు ముందు తెలుగు లో మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తుందట.