Begin typing your search above and press return to search.
సంక్రాంతికి మూడు పుంజులు సాధ్యమేనా?
By: Tupaki Desk | 2 Dec 2015 5:30 AM GMTచాలామంది సంక్రాంతి అంటే గొబ్బిళ్ళు, ముంగిట ముగ్గులు,కోడి పందాలు, పిండివంటలు గుర్తొస్తాయి. కానీ మనలాంటి పిచ్చోళ్ళకి అదేనండీ సినిమా పిచ్చోళ్ళకి మాత్రం సినిమాలే గుర్తొస్తాయి. కొత్త సంవత్సరం తొలి పండక్కి వరుసపెట్టి సినిమాలు విడుదలవుతుంటే ఆ కిక్కే వేరప్పా. అయితే గత రెండు సంవత్సరాలుగా మహా అయితే పండగ సమయానికి రెండు పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందు సందడి చేస్తున్నాయి.
దీనికి కారణం థియేటర్ ల సంఖ్య అన్నది ఇండస్ట్రీ వారి వాదన. ఈ థియేటర్ ల సంఖ్య అనేది పుష్పకవిమానం కాన్సెప్ట్ కి పూర్తి వ్యతిరేకం. అక్కడ ఎంతమంది పట్టినా ఇంకొకరికి చోటు వుంటే ఇక్కడ ఒకటి రెండు సినిమాలు విడుదలైనా హాళ్ళ సంఖ్య సరిపోదు. పక్కా ప్రణాళికతో వెళితే ఈ పెద్ద పండక్కి 3 పెద్ద సినిమాలను ఈజీగా విడుదల చెయ్యచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలప్రకారం వచ్చే సంక్రాంతికి మూడు సినిమాలు బరిలోకి దిగనున్నాయి.
బాలయ్య 99వ సినిమా డిక్టేటర్ టాకీ పార్ట్ పూర్తి చేసుకుని శరవేగంగా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతుంది. అలానే తారక్ నాన్నకు ప్రేమతో సినిమాను సైతం ఆ సీజన్ లోనే దించనున్నారు. ఇక నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా కూడా సందడి చేయనుంది. మరి ఈ పెద్ద పండక్కైనా మూడు పెద్ద సినిమాలు సాధ్యమేనా?