Begin typing your search above and press return to search.

#RRR రిలీజ్ కు ఆ మూడు బిగ్ ట్ర‌బుల్స్

By:  Tupaki Desk   |   26 Dec 2021 8:30 AM GMT
#RRR రిలీజ్ కు ఆ మూడు బిగ్ ట్ర‌బుల్స్
X
2021-22 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ ముందే షెడ్యూల్ చేసిన ప్ర‌కారం జ‌న‌వ‌రి 7న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. తెలుగు-త‌మిళం స‌హా హిందీ బెల్ట్ లో అత్యంత భారీగా విడుద‌ల‌కు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేశారు. అమెరికా సహా విదేశాల్లో ఇప్ప‌టికే ప్రీబుకింగులు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీ మారేందుకు ఛాన్సుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. ముంబైలో ఒమిక్రాన్ టెన్ష‌న్ అంత‌కంత‌కు పెరుగుతోంది. దీనివ‌ల్ల మ‌హా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంకా నియ‌మావ‌ళిని నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌లేదు. ఇప్ప‌టికీ సెకండ్ షోల‌కు ఆస్కారం లేకుండా ఉంది. మునుముందు ఒమిక్రాన్ అదుపుత‌ప్పితే లాక్ డౌన్ ల‌కు ఆస్కారం లేక‌పోలేద‌ని టాక్ వినిపిస్తోంది.

దీని ప్ర‌భావం #RRR వంటి భారీ చిత్రంపై అసాధార‌ణంగా ఉండ‌నుంది. పెద్ద విడుదలల‌ను ఈ ప‌రిస్థితి చాలా ఘోరంగా ప్రభావితం చేస్తుంది. మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు కూడా బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌నున్నాయ‌న్న ఆందోళ‌న డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో ఉంది. మ‌రోవైపు రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమా కూడా ఇదే సంక్రాంతికి విడుద‌ల‌వుతుండ‌డం క‌లెక్ష‌న్ల‌కు మైన‌స్ కానుంద‌ని టాక్ కూడా వినిపిస్తోంది.

ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో రాజమౌళి RRR ని కొంతకాలం వాయిదా వేయవచ్చని ఒక పుకారు షికార్ చేసింది. కానీ జ‌క్కన్న టీమ్ ఆలోచ‌న‌ల్లో ఇప్ప‌టికి మార్పు లేదు. య‌థావిధిగా చెప్పిన స‌మ‌యానికే ఈ చిత్రం విడుద‌ల‌వుతుంద‌ని దర్శక నిర్మాతలు ధృవీకరించారు.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి-రామారావు-రామ్ చ‌ర‌ణ్ బృందం ముంబైలో హిందీ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. క‌పిల్ శ‌ర్మ టాక్ షోతో పాటు స‌ల్మాన్ భాయ్ బిగ్ బాస్ 15 వేదిక‌పైనా ఆర్.ఆర్.ఆర్ కి బోలెడంత ప్ర‌చారం చేశారు. ఇప్ప‌టికే ప‌లు చానెళ్ల ఇంట‌ర్వ్యూల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌చారం ఆగ‌లేదు.. య‌థావిధిగా వ‌స్తున్నామ‌ని సంకేతం ఇచ్చేశారు. ఇప్పుడు షెడ్యూల్ ని మార్చ‌డం కూడా సాధ్య‌ప‌డ‌దు. ఇక ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు స‌హా బెనిఫిట్ షోల‌కు ఆస్కారం లేక‌పోవ‌డంతో ఆ మేర‌కు క‌లెక్ష‌న్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది. ఏపీ ప్ర‌భుత్వంపై హీరోలు నిర్మాత‌ల నుంచి కౌంట‌ర్లు ప‌డుతున్నా కానీ ఎలాంటి మార్పు లేదు. ప్ర‌భుత్వం ఎక్క‌డా రేట్లు పెంచేందుకు సిద్ధంగా లేదు. త‌గ్గేదేలే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనివ‌ల్ల ఆర్.ఆర్.ఆర్ స‌హా సంక్రాంతి సినిమాల‌న్నిటికీ ఇది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దాదాపు ఐదారు భాష‌ల్లో ఒకేసారి ఆర్.ఆర్.ఆర్ విడుద‌ల‌వుతోంది కాబ‌ట్టి ఒక చోట త‌గ్గినా ఇంకో చోట రిక‌వ‌రీ అవుతుంద‌నే టీమ్ భావిస్తోంది. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

కొత్త పోస్ట‌ర్ల‌పైనా రిలీజ్ క్లారిటీ..

ఆర్.ఆర్.ఆర్ వాయిదా ప‌డుతుంద‌న్న ప్ర‌చారం న‌డుమ ప్ర‌తిసారీ టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇంత‌కుముందు ట్రైల‌ర్ లో రిలీజ్ తేదీని ప్ర‌క‌టించారు. రిలీజ్ కి ప‌ది రోజుల ముందు పోస్ట‌ర్లలోనూ తేదీని ముద్రించారు. ఇప్ప‌టికే ట్రైల‌ర్ తో `ఆర్ ఆర్ ఆర్` పై అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 7వ తేదీ రాక‌ కోసం అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. మ‌రోసారి రాజ‌మౌళి త‌న‌దైన మేకింగ్ తో ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందించారు. డి.వి.వి దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ఓపెనింగ్ రికార్డుల‌పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఈ సినిమా 2022 ఇండియాస్ బెస్ట్ ఓపెన‌ర్ గా నిల‌వ‌డ‌మే గాక బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో రికార్డులు బ్రేక్ చేస్తుంద‌న్న అంచ‌నాలున్నాయి.