Begin typing your search above and press return to search.

అమ్మ బయోపిక్ ఎవరిది?

By:  Tupaki Desk   |   23 Aug 2018 2:30 PM GMT
అమ్మ బయోపిక్ ఎవరిది?
X
మహానటి ఎఫెక్టో లేక అలా సీజన్ కలిసి వచ్చిందో కానీ ఇప్పుడు బయోపిక్ లకు డిమాండ్ విపరీతంగా ఉంది. హిందీలో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ సౌత్ లో మాత్రం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ తో పాటు ఎన్టీఆర్ బయోపిక్ ల షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మరోవైపు తమిళనాట అమ్మ జయలలిత బయోపిక్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడటంతో పాటు మేమంటే మేము తీస్తున్నామని ప్రకటనలు గుప్పించడం రకరకాల అనుమానాలకు తెర తీస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో భాగస్వామిగా ఉన్న నిర్మాత విష్ణు ఇందూరి జయ బయోపిక్ తీస్తానని అఫీషియల్ గానే చెప్పారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుపెడతామని ప్రకటించారు. ఈ లోపు ప్రియదర్శిని అనే మరో దర్శకుడు నేను జయ కథను తెరకెక్కిస్తాను అని ప్రకటించేశాడు. ఇతను విభిన్న చిత్రాల దర్శకుడు మిస్కిన్ శిష్యుడు.

ఇవి ఒక ఎత్తు అయితే సీనియర్ దర్శకులు నటులు భారతి రాజా కూడా నేను సైతం అమ్మ బయోపిక్ కు రీలు ఒక్కటి ధారపోస్తాను అంటూ ముందుకొచ్చారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయని భరద్వాజ్ నిర్మాతగా వ్యవహరిస్తారని చెప్పేసారు. టైటిల్ రోల్ లో అనుష్క లేదా ఐశ్వర్య రాయ్ ను తీసుకోవాలనే ప్రతిపాదన కూడా ఉందట. ఇప్పుడు ఈ ప్రకటనల ద్వారా మీడియా సైతం అయోమయంలో పడింది. విష్ణు ఇందూరి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. జయలలిత బయోపిక్ తీయడానికి కావలసిన అనుమతులు లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని రీసెర్చ్ చేసి మరీ సిద్ధంగా ఉన్నానని నొక్కి చెబుతున్నాడు. అసలు ఇందులో ఎవరిదో ఉంటుందో ఎవరు డ్రాప్ అంటారో అర్థం కానీ పరిస్థితి. అమ్మ చనిపోయిన తక్కువ సమయంలోనే ఇంత మంది బయోపిక్ కు రెడీ కావడం బాగానే ఉంది. గతంలో మణిరత్నం ఎంజీఆర్-కరుణానిధిలను స్ఫూర్తిగా తీసుకుని ఇద్దరు తీస్తే ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాని తర్వాత వీటి జోలికి ఎవరూ పోలేదు. ఇప్పుడు అమ్మ బయోపిక్ వార్తలతో మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది.