Begin typing your search above and press return to search.
ఒకరికి ముగ్గురు - మహర్షికి చిక్కు?
By: Tupaki Desk | 28 Nov 2018 8:19 AM GMTప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 25వ సినిమా మహర్షి షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతోంది. ఇటీవలే అమెరికా షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన టీమ్ ఇప్పుడు ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్ లో చాలా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉంది. ప్రొడక్షన్ కు సంబంధించినంత వరకు ఎలాంటి చిక్కులు లేవు కానీ బిజినెస్ కు వచ్చేటప్పటికి ఇబ్బందులు వస్తున్నాయని ఇన్ సైడ్ టాక్. దానికి కారణం ఇది ముగ్గురు అగ్ర నిర్మాతల కాంబోలో రూపొందడమేనట. దిల్ రాజు అందరికన్నా ఎక్కువ యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో మిగిలిన ఇద్దరి ఆమోదం తప్పనిసరి కావడంతో కొంత జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
మహర్షి కోసం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన 16 కోట్ల ఆఫర్ కు నో చెప్పడానికి కారణం ఈ సమన్వయ లోపమే కారణమని చెబుతున్నారు. ఇది రీజనబుల్ డీల్ అని దిల్ రాజు భావించినప్పటికీ ఇంకా మంచి రేట్ వస్తుందేమో వెయిట్ చేద్దామని అశ్వనిదత్ చెప్పడంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదట. ఒకవేళ అంత కన్నా ఎక్కువ రాకపోతే స్వంతంగా రిలీజ్ చేద్దామనే ఆలోచన కూడా చేశారట. ఇది ఒక్క యుఎస్ కు మాత్రమే కాకుండా కొన్ని ఏరియాలకు సంబంధించి వస్తున్న ఫోన్ కాల్స్ ఆఫర్స్ లో కీలకమైన వాటిని హోల్డ్ లో ఉంచుతున్నట్టు తెలిసింది.
ఇంకా విడుదలకు నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి కొద్దిరోజులు అయ్యాక టీజర్ తో పాటు కొంత ప్రమోషన్ చేసాక హైప్ పెరుగుతుందని అప్పుడు ఇంకాస్త ఎక్కువ ధర ఆశించవచ్చు అనేది అశ్విని దత్ పివిపి ప్రసాద్ ల ఆలోచనగా చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో కానీ ట్రేడ్ సర్కిల్స్ లో దీని మీద చర్చ జోరుగా సాగుతోంది. అయితే దీని ప్రభావం పాజిటివ్ గా ఉంటే ఓకే కాని ఇంకోలా ఉంటే మాత్రం చిక్కే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.