Begin typing your search above and press return to search.
మూడు పాటలతోనే సర్దుకుంటున్న సైరా!
By: Tupaki Desk | 10 Sep 2019 1:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి సినిమానుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలు కొన్ని ఉంటాయి. చిరు మార్క్ ఎంటర్టైన్మెంట్.. పాటలు.. ఫైట్లు వాటిలో ప్రముఖమైనవి. మెగాస్టార్ సినిమా ఎలా ఉన్నప్పటికీ జస్ట్ పాటలు.. ఆయన డ్యాన్సుల కోసం రిపీటెడ్ గా చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అదేమీ అతిశయోక్తి కాదు. అయితే చిరు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం కాదు. ఇదో హిస్టారికల్ ఫిలిం. ఇందులో యాక్షన్ సీక్వెన్సులకు చోటు ఉంటుంది కానీ పాటల పరిస్థితి ఏంటి?
ఈ సినిమాలో పాటల విషయంలో అభిమానులకు కాస్త నిరాశ తప్పదు. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలే ఉంటాయని.. అందులో ఒకటి నేపథ్యంలో వినిపించే పాట అని దర్శకుడు సురేందర్ రెడ్డి రీసెంట్ గా వెల్లడించారు. ఈ లెక్కన 'సైరా' లో రెండే పాటలు అనుకోవాలి. మూడు పాటలకు సిరివెన్నెల సాహిత్యం అందించారట. ఈ సినిమాలో పాటలకు బాణీలు అందించింది అమిత్ త్రివేది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు జూలియస్ పకియం అందించారు. ఇద్దరూ బాలీవుడ్ టెక్నీషియన్సే.
చారిత్రాత్మక చిత్రం కాబట్టి పాటలు సినిమా ఫ్లో ను దెబ్బతీయకుండా ఉంటేనే బెటర్. ఈమధ్య వచ్చిన సినిమాలలో అవసరమైన మేరకే.. అవసరమైనన్ని పాటలు ఉంచుతున్నారు. అలా కాకుండా ఫార్మాట్ ప్రకారం ఐదారు పాటలు ఇరికిస్తే నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. అలాంటి పరిస్థితి రాకముందే పాటల సంఖ్యను తగ్గించడం బెటర్. అయితే ఉన్న రెండు పాటలు ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే అదే పదివేలు.