Begin typing your search above and press return to search.

మూడేళ్ల ప్రేమ బంధంకు బ్రేకప్ చెప్పేసిన ముద్దుగుమ్మ

By:  Tupaki Desk   |   1 Nov 2022 5:33 AM GMT
మూడేళ్ల ప్రేమ బంధంకు బ్రేకప్ చెప్పేసిన ముద్దుగుమ్మ
X
బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు.. బ్రేకప్‌ లు అనేవి చాలా కామన్‌ గా చూస్తూనే ఉంటాం. ఇటీవలే యంగ్ హీరోయిన్‌ హీరో బ్రేకప్‌ అయ్యారనే వార్తలు వచ్చాయి.. ఆ వార్తలు మరవకముందే అదే హీరోయిన్ మరో హీరోతో రిలేషన్ లో ఉందనే ప్రచారం మొదలు అయ్యింది. మొత్తానికి ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. తాజాగా మరో బ్రేకప్ వార్త బాలీవుడ్‌ లో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయిన హ్యూమా ఖురేషి తన మూడేళ్ల ప్రేమ బంధం కు ముగింపు పలికిందనే వార్తలు వస్తున్నాయి. ఈమె తన ప్రియుడు ముదస్సర్ అజీజ్ తో బ్రేకప్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది. బాలీవుడ్‌ మీడియా ఈ విషయమై కోడై కూస్తూ తెగ కథనాలు రాసేస్తోంది.

ముదస్సర్ అజీజ్ తో హ్యూమా రిలేషన్ మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. వీరిద్దరు పెళ్లి పీఠలు ఎక్కే అవకాశం ఉందని కూడా వారి సన్నిహితులు అనుకున్నారట. కానీ ఇద్దరి మనసులు కలవక పోవడంతో విడి పోవాలనే నిర్ణయానికి వచ్చి ఇద్దరు కూడా ఒకరికి ఒకరు బ్రేకప్‌ చెప్పుకున్నారు అనేది టాక్‌.

హ్యూమా.. ముదస్సర్ ల బ్రేకప్ కు అసలు కారణం ఏంటీ అనే విషయంలో పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే హ్యూమా ఖురేషి ప్రస్తుతం హిందీలో సోనాక్షి సిన్హా తో కలిసి డబుల్‌ ఎక్స్‌ఎల్‌ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. అంతే కాకుండా సౌత్‌ నుండి కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయని.. త్వరలోనే ఒకదానికి సైన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.