Begin typing your search above and press return to search.

దుబాయ్‌ లో సాహో - మాల్టాలో థ‌గ్స్‌

By:  Tupaki Desk   |   31 July 2018 4:10 AM GMT
దుబాయ్‌ లో సాహో - మాల్టాలో థ‌గ్స్‌
X
మేము గొప్ప అంటే మేము గొప్ప అంటూ సినిమావోళ్లు డ‌బ్బాలు కొట్టుకోవ‌డం చూస్తుంటాం. ఇండియాలోనే ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సాహో - థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాల మ‌ధ్య అలాంటి వార్ న‌డుస్తోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఈ రెండు సినిమాల కోసం భారీ బ‌డ్జెట్లు కుమ్మ‌రిస్తున్న నిర్మాత‌లు ఔట్‌ డోర్ షూటింగుల కోస‌మే మంచి నీళ్ల‌లా ధ‌నం ఖ‌ర్చు చేస్తున్నారు. ఒక‌రు 100కోట్లు చెబితే - ఇంకొక‌రు 80కోట్లు ప్ర‌క‌టిస్తున్నారు. అంత పెద్ద మొత్తాల్ని ఔట్‌ డోర్‌ లో సెట్స్ కోసం - భారీ యాక్ష‌న్ దృశ్యాల చిత్రీక‌ర‌ణ‌ల కోసం ఖ‌ర్చు చేశామ‌ని అదే ప‌నిగా ప్ర‌చారం చేస్తున్నారు. ఏదైతేనేం.. ఇదంతా ఓ గ్రాండ్ విజువ‌ల్ బొనాంజాని అభిమానుల‌కు అందించే త‌ప‌న అని భావించ‌వ‌చ్చు.

మేమే గొప్ప అని `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` టీమ్ చెప్పుకుంటోంది. యూర‌ప్‌ లో తెర‌కెక్కిన‌ ఎక్స్‌ పెన్సివ్ ఇండియ‌న్ సినిమాల్లో మేమే గొప్ప అని ప్ర‌క‌టించింది టీమ్‌. థ‌గ్స్ కోసం ఏకంగా 45రోజుల చిత్రీక‌ర‌ణ‌కు 80కోట్ల వ‌ర‌కూ ఔట్‌ డోర్ బ‌డ్జెట్ ఖ‌ర్చు చేశామ‌ని ప్ర‌క‌టించింది. అయితే యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ప్ర‌భాస్ `సాహో` కోసం అంత‌కంటే గొప్ప బ‌డ్జెట్‌ నే వెచ్చించిన సంగ‌తిని గుర్తు చేయాలి. దుబాయ్‌ లో భారీ యాక్ష‌న్‌ షెడ్యూల్ కోసం యువి సంస్థ ఏకంగా 100 కోట్ల ఖ‌ర్చు చేసింది. పైగా 60రోజుల పాటు అక్క‌డే చిత్రీక‌ర‌ణ‌లు సాగించారు. లోక‌ల్‌ గా లొకేష‌న్ల అనుమ‌తుల కోస‌మే నానా పాట్లు పడ్డారు. ఇక థ‌గ్స్ బృందం - సాహో బృందం ఇంట‌ర్నేష‌న‌ల్ సెట్ డిజైన‌ర్ల‌నే ఉప‌యోగించారు. ఇక భారీ షిప్పుల కోసం అమీర్‌ ఖాన్ & టీమ్ భారీ మొత్తాల్ని ఖర్చు చేసిన మాట వాస్త‌వ‌మే అయినా.. సాహో టీమ్ ఫ్లై ఓవ‌ర్లు - ఆకాశ‌ హార్మ్యాల్లోంచి జంప్ సీన్ల కోస‌మే విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేసింది. ఇలా పోల్చి చూస్తే థ‌గ్స్ కి ఏమాత్రం తీసిపోని రీతిగా మ‌న ప్ర‌భాస్ అండ్ టీమ్ ఎంతో రిస్క్ చేసింద‌ని చెప్పొచ్చు. థ‌గ్స్ కోసం 200కోట్ల బ‌డ్జెట్ కేటాయిస్తే - సాహో కోసం ఏకంగా 300 కోట్లు అంత‌కుమించి పెట్టేందుకు రెడీ అయ్యింది యువి సంస్థ‌. అదంతా స్నేహితుడు ప్ర‌భాస్ కోసం చేస్తున్న రిస్క్‌. టిప్ప‌ర్ లారీ ఎళ్లి బాలీవుడ్‌ ని గుద్దేస్తే ఎలా ఉంటుందో అర్థం కావాలి క‌దా!?