Begin typing your search above and press return to search.
బాహుబలి రికార్డ్ బ్రేక్ కు థగ్స్ మాస్టర్ ప్లాన్..!
By: Tupaki Desk | 25 Oct 2018 7:31 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక సౌత్ సినిమా బాలీవుడ్ సినిమాలకు సైతం అందనంత ఎత్తులో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 1700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన బాహుబలి 2 చిత్రం రికార్డును అమీర్ ఖాన్ తన ‘దంగల్’ చిత్రంతో బ్రేక్ చేశాడు. చైనాలో దంగల్ చిత్రంకు అనూహ్యమైన వసూళ్లు వచ్చిన నేపథ్యంలో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్ అయ్యింది. కాని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి ఈ నెలకొల్పిన రికార్డు మాత్రం అలాగే ఉంది.
‘బాహుబలి 2’ తర్వాత ఎన్నో స్టార్ హీరోల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి. కాని ఏ ఒక్కటి కూడా ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేయలేక పోయాయి. దంగల్ కూడా ఓవరాల్ కలెక్షన్స్ పరంగా రికార్డు సాధించింది కాని, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం బాహుబలి 2 తర్వాత స్థానంలోనే ఉంది. ఇప్పుడు బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టేందుకు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సిద్దం అవుతున్నట్లుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా బాహుబలి 2 రికార్డును ఇది మాత్రమే బ్రేక్ చేయగలదని అంతా నమ్ముతూ వస్తున్నారు. అయితే ట్రైలర్ విడుదల తర్వాత ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించడం కష్టమేనేమో అనిపిస్తుంది. అయినా కూడా రికార్డు బ్రేక్ కు ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రాన్ని నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు మాస్టర్ ప్లాన్ సిద్దం చేశారు. ఈ చిత్రాన్ని సౌత్ లో పలు భాషలతో పాటు, ఉత్తరాధిన అత్యధికంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రదర్శింపబడే మల్టీప్లెక్స్ ల్లో మొదటి వారం రోజులు 10 శాతం టికెట్ల రేట్లు అధికంగా పెంచేందుకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్నారు.
కేవలం హిందీ వర్షన్ కు మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా టికెట్ల రేట్లను పెంచడం వల్ల బాహుబలి 2 రికార్డుకు చేరువ కావచ్చు అనేది నిర్మాతల ప్లాన్ గా తెలుస్తోంది. ఏదోలా చేసి బాహుబలి 2 డొమస్టిక్ రికార్డును బ్రేక్ చేయాలని థగ్స్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బాహుబలి 2 వారికి తలొగ్గేనా చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ను వచ్చే నెలలో దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ తో పాటు అమితాబచ్చన్, కత్రీనా కైఫ్ లు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.