Begin typing your search above and press return to search.
థగ్స్ ఓడినా.. బాహుబలిని గెలిచారు!
By: Tupaki Desk | 9 Nov 2018 12:55 PM GMTబాలీవుడ్ సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్ - అమితాబచ్చన్ లు కలిసి నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రం ఫ్లాప్ అని తేలిపోయింది. సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని ఏకి పారేస్తున్న విషయం తెల్సిందే. 300 కోట్లు పెట్టి ఇంత చెత్త సినిమాను తీసినందుకు నిర్మాతను మరియు దర్శకుడిని అరెస్ట్ చేయాలని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతటి చెత్త టాక్ ను దక్కించుకున్న థగ్స్ కు ఒక విషయంలో మాత్రం సంతోషం అని చెప్పుకోవాలి. ఈ చిత్రం మొదటి నుండి ‘బాహుబలి 2’ రికార్డును దాటలని అమీర్ ఖాన్ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే జరిగింది.
‘బాహుబలి 2’ చిత్రం ఇండియాలోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మొన్నటి వరకు నిలిచింది. బాహుబలి 2 మొదటి రోజే ఇండియాలో 40.73 కోట్లను రాబట్టింది. ఇప్పుడు ఆ స్థానంను థగ్స్ దక్కించుకుంది. ఆరు వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదలైన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం మొదటి రోజు 52.25 కోట్లను వసూళ్లు చేసినట్లుగా చెబుతున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈ మొత్తం ఇంకా భారీగా ఉండేదంటూ టాక్ వినిపిస్తుంది.
అమీర్ ఖాన్ ఈ చిత్రంతో మరోసారి బాలీవుడ్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. రెండవ రోజు నుండి కలెక్షన్స్ అనూహ్యంగా డ్రాప్ అయినా మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం రికార్డును దక్కించుకోవడం అమీర్ ఖాన్ ఫ్యాన్స్ కు సంతృప్తిని కలిగించే విషయం. లాంగ్ రన్ లో బాహుబలి రికార్డును బద్దలు కొట్టాలన్న కోరిక మాత్రం థగ్స్ సాధించలేక పోయారు.