Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: తడాఖా చూపించిన థగ్స్
By: Tupaki Desk | 27 Sep 2018 8:46 AM GMT2018 మోస్ట్ అవైటెడ్ మూవీ `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` అంటూ ప్రచారం సాగిస్తోంది యశ్ రాజ్ సంస్థ. బిగ్ బి అమితాబ్ బచ్చన్ - మిస్టర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ - కత్రిన కైఫ్ - సనా షేక్ వంటి భారీ తారాగణంతో `ధూమ్ 3` ఫేం విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాని తెరకెక్కించడంతో అందరిలో ఒకటే ఉత్కంఠ. టాప్ టెక్నీషియన్లతో హాలీవుడ్ స్టాండార్డ్స్‌లో ఇండియాస్ బెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. అందుకే థగ్స్ పై అందరిలోనూ అంచనాలు రెట్టించాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ప్రాంతీయ భాషల్లోనూ ప్రచారం మొదైలంది. ముఖ్యంగా తెలుగు - తమిళ్ లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని విజయ్ కృష్ణ ఆచార్య - అమితాబ్ - అమీర్ ప్రచారం సాగించారు. నవంబర్ 8న దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్లలో రిలీజ్ కానుంది.
తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం విజువల్స్ గ్రాండియారిటీ మైమరిపించింది. సుమారు 225 ఏళ్ల క్రితం (1795లో) ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు సముద్ర మార్గం గుండా భారతదేశంలో ఆయుధాల వ్యాపారం పేరుతో అడుగుపెట్టినప్పటి దృశ్యాల్ని అద్భుతంగా చూపించారు. ఆంగ్లేయుల రాక ఆ తర్వాత ప్రమాదాల్ని ఈ కథలో ఎలివేట్ చేయడం ఆసక్తి రేకెత్తించింది. ట్రైలర్ ఆద్యతం డార్క్ షేడ్ తో నాటి వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇక పాత్రధారుల విషయానికి వస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆరాచకాల్ని ఎదిరించే థగ్స్ గా బిగ్ బి అమితాబ్ - సనాషేక్ బృందం కనిపించింది. సనా షేక్ శత్రువుపైకి లంఘిస్తూ విరోచితమైన పోరాటం చేయడం - బాణాల్ని సంధించడం చూస్తుంటే ఆ పాత్ర ప్రాముఖ్యత పెద్దదేనని అర్థమవుతోంది.
ఇక మిస్టర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ఫిరంగి పాత్ర సినిమాకే హైలైట్ కానుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ పాత్ర నారదుడి తరహా పాత్ర. నారదుడు ముల్లోకాల్లో తిరిగి అందరికీ సమాచారం చేరవేస్తూ లోక కళ్యాణానికి పాల్పడినట్టే భారతదేశానికి మేలు చేసే పాత్రలో కనిపిస్తున్నాడు అమీర్. ఈస్ట్ ఇండియా కంపెనీ క్రూరుడితో స్నేహం చేసినట్టే చేసి - అల్లా భక్ష్ (అమితాబ్)కి నమ్మిన బంటుగా ఒక్కసారిగా విశ్వరూపం చూపించాడు. ఇక సముద్రంలో భారీ ఓడల్లో ప్రయాణం.. ఆ ఓడలపైనే భారీ యుద్ధాలు మైమరిపించాయి. ``నా మనస్తత్వం అలాంటిది... అని అమీర్ ఖాన్ అంటే `నాది భరోసా` అని బిగ్ బి అమితాబ్ చెప్పే డైలాగుల్ని బట్టి కథలో ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఎలివేట్ అయ్యింది. ట్రైలర్‌లో విజువల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ - వీఎఫ్ ఎక్స్ కోసం యశ్ రాజ్ సంస్థ భారీగానే ఖర్చు చేసిందని ట్రైలర్ చెబుతోంది. హిందీ - తెలుగు - తమిళం - మలయాళం - కన్నడం అన్ని భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది.