Begin typing your search above and press return to search.
రజినీ సినిమాతో ఢీకొడితే నష్టమే
By: Tupaki Desk | 15 March 2018 10:10 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్. అతనికి మించిన పాపులారిటీ ఉంది మన దక్షిణాది స్టార్ రజినీకాంత్‌కు. రజినీ సినిమా రోబో 2.0 ఎప్పుడు విడుదలవుతుందో కచ్చితంగా తెలియని పరిస్థితి ఉంది. అలాగే అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ కూడా ఈ ఏడాది విడుదలవ్వబోతోంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతాయేమోనని అమీర్ ఖాన్ బెంగపెట్టేసుకుంటున్నాడు. అలా జరగకూడదని కోరుకుంటున్నాడు.
2010లో విడుదలైన రోబో దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రోబో సినిమా టీవీలో వస్తే కళ్లప్పగించి చూసేవారు ఎంతోమంది. ఇప్పుడు దానికి సీక్వెల్ 2.0 వస్తోంది. ఆ సినిమా నిజానికి గతేడాదే విడుదల అవ్వాలి. కానీ ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున విడుదల చేస్తామన్నారు. కానీ చేయలేదు. ఏప్రిల్ లో అన్నారు అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు జూన్ జూలై ఆగస్టు... ఇలా ఏ నెలైనా కావచ్చని అంటున్నారు. ఆ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో కచ్చితమైన తేదీ లేదు. దీంతో అమీర్ ఖాన్ తన సినిమాను ఎప్పుడు విడుదల చేసుకోవాలా అని బెంగపెట్టేసుకుంటున్నాడు. అతను ప్రస్తుతం నటిస్తున్న సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇందులో కత్రినా కైఫ్ నటిస్తోంది. ఈ సినిమా, రోబో 2.0 విడుదల ఒకే సమయంలో అవుతాయేమోనని అమీర్ ఖాన్ అనుమానం వ్యక్తం చేశాడు. అలా జరిగితే తమకే నష్టం అన్నట్టు మాట్లాడాడు. రజినీ లాంటి పెద్ద హీరోతో పోటీపడలేమని చెప్పాడు.
దేశంలో 5000 థియేటర్లు ఉన్నాయని... పెద్ద సినిమాలు విడుదలైననప్పుడు నిర్మాతలు అధిక ధియేటర్లను తీసుకుంటాడని చెప్పాడు. అప్పుడు రెండో సినిమా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. కనుక అలా రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలచేయడం లేదా తక్కువ రోజుల గ్యాప్‌తో విడుదల చేయడం... చేయకూడదని అన్నాడు. ఏదైనా రోబో సీక్వెల్ తమకు సమస్యలేనని ఒప్పుకున్నాడు.