Begin typing your search above and press return to search.
తునివు.. సేఫ్ జోన్ లో పడేసిన అజిత్
By: Tupaki Desk | 17 Jan 2023 4:14 AM GMTఅజిత్ కుమార్ హీరోగా వినోత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ తునివు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీకి మొదటి రోజు ఎవరేజ్ టాక్ వచ్చింది. అయితే కూడా సంక్రాంతి పండగ ఎఫెక్ట్, హీరో అజిత్ మాస్ మానియాకి సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. జనవరి 11న రిలీజ్ అయిన ఈ మూవీకి విజయ్ వారిసు మూవీ కంటే తక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి.
వారిసు మూవీ 47 కోట్లకి పైగా మొదటి రోజు కలెక్షన్స్ సొంతం చేసుకుంటే తునివు కేవలం 41.25 కోట్లతో సరిపెట్టుకుంది. ఇక ఎవరేజ్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 15.25 కోట్లు మాత్రమే వచ్చాయి.
మూడో రోజు కూడా ఎలాంటి మార్పు లేకుండా 15.5 కోట్లు వచ్చాయి. రెండో రోజు కంటే మూడో రోజుకి 25 లక్షలు ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. అయితే శనివారానికి మళ్ళీ టాక్ మారిపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా పుంజుకున్నాయి. శనివారం 21.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే.
ఆదివారం మరింత పెరిగి 22.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఏకంగా 116.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వంద కోట్ల బ్రేక్ ఈవెంట్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే సినిమా కలెక్షన్స్ అంతా రాబట్టడంతో పాటు లాభాల బాట పట్టింది. ఇకపై సినిమాకి వచ్చే కలెక్షన్ అంతా లాభమే అని చెప్పాలి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలో మొదటి బ్రేక్ ఈవెంట్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రంగా తునివు నిలబడింది.
అయితే వారసుడు బ్రేక్ ఈవెంట్ ఎక్కువ కావడంతో దానిని అందుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే ఛాన్స్ ఉంది. ఇక వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు వందల కోట్ల క్లబ్ లో చేరినా కూడా ఇంకా బ్రేక్ ఎవెన్ పాయింట్ కి రీచ్ కాలేదు. మరి లాంగ్ రన్ లో ఈ మూడు సినిమాలకి వచ్చే ప్రేక్షకాదరణ బట్టి వాటి సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.