Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో స్టార్‌ హీరో సినిమా కనిపించడం లేదు

By:  Tupaki Desk   |   13 Jan 2023 10:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో స్టార్‌ హీరో సినిమా కనిపించడం లేదు
X
సంక్రాంతి సందడి కోసం ఎదురు చూసిన సినీ ప్రేక్షకుల ముందుకు సినిమాలు వచ్చేశాయి. జనవరి 11వ తారీకున తమిళ స్టార్‌ హీరో అజిత్ నటించిన తునివు తెలుగు లో తెగింపుగా డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. మొదటి రోజు కాస్త ఎక్కువ థియేటర్లే ఆ సినిమాకు దక్కింది. తెగింపుకు నెగటివ్‌ టాక్ వచ్చింది.

తమిళనాడులో భారీ ఆధరణ దక్కినా కూడా తెలుగు లో మాత్రం తెగింపును జనాలు పట్టించుకోవడంలేదు. దానికి తోడు తర్వాత రోజే వీర సింహారెడ్డి సినిమా తో బాలయ్య రావడంతో చాలా వరకు థియేటర్లు తగ్గాయి. రెండవ రోజు ఒక మోస్తరు థియేటర్లతో ఆడిన తెగింపు సినిమా మూడవ రోజుకు వచ్చేప్పటికి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తప్ప కనిపించడం లేదు.

వాల్తేరు వీరయ్య సినిమా నేడు విడుదల అవ్వడంతో తెగింపు సినిమాను జనాలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య వంటి స్టార్‌ హీరోల సినిమాలు ఉన్న సమయంలో యావరేజ్ టాక్ దక్కించుకున్న తెగింపు కు థియేటర్లను కొనసాగించడం కష్టంగా మారిందట.

కొన్ని మల్టీ ప్లెక్స్ ల్లో మరియు అక్కడక్కడ సింగిల్‌ స్క్రీన్స్ లో మినహా తెగింపు సినిమా పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. రేపు వారసుడు రాబోతున్న నేపథ్యంలో తెగింపు సినిమా ఆ మిగిలిన థియేటర్ల నుండి కూడా కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

స్టార్‌ హీరోల సినిమాలు వస్తున్న సమయంలో డబ్బింగ్‌ సినిమాలను అది కూడా పెద్దగా క్రేజ్ లేని హీరోల డబ్బింగ్‌ సినిమాలను తీసుకు వస్తే ఇదే పరిస్థితి అని తెలుగు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇలాంటి పరిస్థితి ఎదురు పడకుండా ఒక గుణపాఠంగా గుర్తు పెట్టుకోవచ్చు.