Begin typing your search above and press return to search.
టాలీవుడ్ పాలిట భస్మాసుర హస్తంగా 'టికెట్ల ధరల పెంపు'
By: Tupaki Desk | 30 April 2022 4:30 PM GMTసినీ అభిమాన దేవుళ్లకు.. సినీ నటులకు మధ్య అనుసంధానం చేసేది సినిమా. మూడు గంటల పాటు వెండితెర మీద తమ అభిమాన నటులు చేసే విన్యాసాల్ని.. దర్శకుడు చెప్పే కథ అందించే వినోదంతో తడిచి ముద్దకావటానికి సగటు జీవి మొదలు హార్డ్ కోర్ ఫ్యాన్ వరకు సినిమాలకు వస్తుంటారు. అలాంటి సినిమాను ఖరీదైన వ్యవహారంగా మార్చేసిన ఘనత టాలీవుడ్ నిర్మాతలతో పాటు అగ్ర నటులు కూడా. చిన్న హీరోల విషయంలో సినిమాకు సంబంధించి వారి పాత్రలు.. మరికొన్ని అంశాలు తప్పించి.. ఇంకేమీ పట్టించుకునేంత చాన్సు ఉండదు.ఒక మధ్య తరహా హీరో సైతం దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత సినిమాకు ఓకే చెప్పిన తర్వాత.. సదరు నిర్మాతను ఫాలో కావాల్సిందే తప్పించి.. తన మాటల్ని ఎక్కువగా చెప్పే అవకాశం ఉండదు. కానీ.. అగ్ర హీరోలకు అలాంటి పరిమితులు ఏమీ ఉండవు. ప్రతి సందర్భంలోనూ వారి జోక్యం ఉంటుంది. వారు మార్పు కావాలనుకుంటే వెంటనే మార్చేయగలరు. ఇదెంత వరకు అంటే.. ఆ మధ్యన ఏపీలో జగన్ సర్కారు కావాలనే తన సినిమాకు పరిమితులు విధించటం.. టికెట్ల ధరల్ని కారుచౌకగా నిర్ణయం తీసుకుంటే.. తన సినిమాను అవసరమైతే ఓటీటీలో విడుదల చేస్తానని చెప్పటం చూస్తే.. అగ్రహీరోలకు తాను చేసే సినిమా మీద ఎంత కమాండ్ ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.
ఇదంతా ఎందుకంటే.. ఏడాదికో.. రెండేళ్లకో ఒక సినిమా చేసే అగ్రహీరోలు.. తమ సినిమా టికెట్ల ధరల్ని ఈ మధ్యన భారీగా పెంచేస్తున్నారు. వారి వరకు భారీ బడ్జెట్ అని.. ఇంకేదో కారణాలు చెబుతారు. కానీ.. వారిని అభిమానించి.. ఆరాధించే వారితో పాటు.. సగటు సినీ ప్రేమికుడి జేబుకు ఈ పెరిగిన ధరలు భారంగా మారతున్న విషయాన్ని మర్చిపోకూడదు. గతంలో మాదిరి సినిమాల పరిస్థితి లేదు. ఇప్పుడు బోలెడన్ని మార్పులు వచ్చేశాయి. కొన్ని క్రేజీ సినిమాల్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేసి.. రోజుకు రూ.100 కోట్ల కలెక్షన్లకు పైనే సాధించేలా ప్లాన్ చేస్తున్నారు.
థియేటర్ల సంఖ్య భారీగా పెంచటం వరకు ఓకే. ఎక్కువ ఆటలు ఆడించటం వల్ల ఇబ్బంది లేదు. సమస్యంతా ఎక్కడంటే.. టికెట్ ధరతోనే. హైదరాబాద్ మల్టీ ఫ్లెక్సుల విషయానికే వద్దాం.. కరోనా వేళలో రూ.137 ఉన్న టికెట్ ధర తర్వాత రూ.200లకు చేరింది. ఫర్లేదు.. అన్ని పెరిగినప్పుడు సినిమా టికెట్ ధర పెరగటం తప్పు కాదని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. పెద్ద హీరోల సినిమా టికెట్ల ధరల్ని ఏకంగా రూ.300, రూ.350 వరకు తీసుకెళ్లటంతోనే అసలు ఇబ్బంది. అంటే.. మల్టీఫ్లెక్సులో కరోనాకు ముందు ఉన్న టికెట్ ధరతో పోలిస్తే.. ఈ రోజున టికెట్ ధర ఏకంగా వంద శాతం పెరగటం మామూలు విషయం కాదు.
ఓపక్క పెట్రోల్..డీజిల్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయిన వేళ.. సినిమా టికెట్లు ఆకాశానికి అంటితే ఏం జరుగుతుంది? ఒక కుటుంబం మొత్తం థియేటర్ కు వచ్చే బదులు.. అయితే ఇంటి పెద్ద.. లేదంటే ఇంట్లో ఉన్న కాలేజీకి వెళ్లే కొడుకు కానీ కూతురుకానీ సినిమాకు వెళ్లటం.. మిగిలినవారు నెల తర్వాత వచ్చే ఓటీటీలో చూద్దామని ఫిక్సు అవుతున్న పరిస్థితి. కేవలం నలభై రోజుల వ్యవధిలో క్రేజీ సినిమాలుగా.. ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భీమ్లానాయక్.. రాథే శ్యామ్.. ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2.. ఆచార్య సినిమాలు విడుదలయ్యాయి. మిగిలిన సినిమాలు కొన్ని ఉన్నా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ ఐదుసినిమాల్ని లెక్కలోకి తీసుకుంటే.. వీటిల్లో కనీసం మూడు సినిమాలు చూద్దామనుకున్నా.. ఒక మధ్యతరగి కుటుంబం పెట్టాల్సిన ఖర్చు టికెట్ల వరకే రూ.4వేల వరకు ఉంటుంది.
40 రోజుల వ్యవధిలో రూ.4వేల మొత్తాన్ని (తినే తిండి లాంటివి వదిలేస్తే) మూడు సినిమాలకు ఖర్చు పెట్టటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా? అన్న విషయాన్ని టాలీవుడ్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్ద సినిమా అయినా.. మరెంత తోపు మూవీ అయినా నెల కాదంటే నెలన్నర వ్యవధిలో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కొన్నిసార్లు అంతకు ముందే రిలీజ్ అవుతున్నాయి. గతంతో పోలిస్తే.. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో టీవీ తెరలు పెద్దవి కావటాన్ని మర్చిపోకూడదు. థియేటర్ లో ఉన్నంత పెద్ద తెర లేకున్నా.. జేబు మీద పడే భారంతో పోలిస్తే.. ఇంట్లో ఉన్న ఒక మోస్తరు టీవీ తెరలో తమ అభిమాన సినిమాను చూడటం అలవాటైంది.
కరోనా వేళ.. ఓటీటీ విప్లవం రావటం.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూడటం ఎక్కువైంది. ఇక.. వెబ్ సిరీస్ లు చెప్పాల్సిన అవసరమే లేదు. వాటన్నింటిని చూడటానికి ఇప్పుడు సమయం అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటప్పుడు ఊరించే ఓటీటీల్లో చూడాల్సిన కంటెంట్ ఒకవైపు.. మరోవైపు బిజీ జీవితం.. ఇంకోవైపు అప్పుడప్పుడు విడుదలయ్యే పెద్ద సినిమాలు. థియేటర్ కు వెళ్లి ఒక సినిమా చూసేందుకు అన్నీ కలుపుకుంటే నాలుగు గంటల సమయం పడుతుంది. నగరాల్లో ఉండే వారికి మరో గంట అదనంగా వేసుకోవచ్చు. ఇప్పుడున్న బిజీ జీవితంలో నాలుగు గంటల సమయం కేటాయించటం ఒక ఎత్తు అయితే.. అందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన రావటం మరో కష్టం.
ఇన్ని కష్టాలు తట్టుకున్న వేళ.. సినిమా బాగుంటే ఓకే. బాగోలేదన్న టాక్ వస్తే.. నిర్దాక్షిణ్యంగా సినిమాను రిజెక్టు చేస్తున్నారు.గతంలో తమ అభిమాన నటుడి సినిమా టాక్ సరిగా లేకుంటే ఫ్యాన్స్ ఒక ఉద్యమం మాదిరి సినిమా ధియేటర్లకు వెళ్లేవారు. తమ అభిమాననటుడి సినిమాకు తమ సంఘీభావం తెలిపే పరిస్థితి. ఇప్పుడు తరం మారింది. సోషల్ మీడియా జనరేషన్ వచ్చేసింది. అగ్రహీరోలు ఎంత ప్రాక్టికల్ గా సినిమాను ఒక వ్యాపారంగా చూస్తున్నారో.. సినీ అభిమానులు కూడా అంతే ప్రాక్టికల్ గా సినిమా బాగుంటే సరి... లేదంటే నో అన్నట్లుగా మారారు. భావోద్వేగంతో ఉండాల్సిన బంధాన్ని డబ్బు దెబ్బ తీస్తున్న వేళ.. అత్యాశకు పోకుండా ఉన్న ప్రేక్షకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత టాలీవుడ్ దే. లేనిపక్షంలో సగటు సినిమా ప్రేక్షకుడు థియేటర్ కు దూరం కావటం ఖాయం. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది. దాన్ని ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది. కాదంటే.. భస్మాసుర హస్తం గురించి తెలుసు కదా?