Begin typing your search above and press return to search.
టికెట్ల ధర పెంపు మహర్షికి భారీ షాక్ కానుందా?
By: Tupaki Desk | 8 May 2019 5:10 AM GMTపెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవటం కోసం వ్యాపారం ఏదైనా.. వ్యాపారస్తుడు చాలానే ఎత్తులు వేస్తాడు. అయితే.. తన కస్టమర్ కు నొప్పి కలిగించని రీతిలో వ్యవహరిస్తే ఓకే. అందుకు భిన్నంగా తన లాభాల కోసం తనను దోపిడీ చేసేందుకు సైతం వెనుకాడడన్న భావన కలిగితే మొదటికే మోసం రావటం ఖాయం.
తాజాగా మహర్షి నిర్మాతల తీరు ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. టికెట్ల ధరల్ని భారీగా పెంచేస్తూ ప్రచారం చేసుకోవటం.. దానికి తెలంగాణ ప్రభుత్వం పేరు వాడుకోవటంపై ప్రభుత్వం సైతం గుర్రుగా ఉంది. అప్పుడెప్పుడో కోర్టు ఇచ్చిన అవకాశాన్ని ఆసరా చేసుకొని.. ప్రజల మీద అనవసర భారాన్ని పెంచుకోవాలన్న తీరుపై నెగిటివ్ ప్రచారం మొదలైంది.
సామాజిక మాథ్యమాలు బలంగా మారిన వేళ.. మహర్షి టికెట్ల పెంపునకు వ్యతిరేకంగా ఆన్ లైన్లో ఏదైనా ఉద్యమం మొదలైతే.. కొత్త తిప్పలు తప్పవని చెబుతున్నారు. భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోలు.. ఏడాదికి.. ఏడాదిన్నరకు ఒక సినిమా చేయటం.. పెట్టిన భారీ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకునేందుకు వీలుగా టికెట్ల ధరల్ని పెంచేయటం ఏ మాత్రం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఒకవేళ సినిమా మీద ఉన్న క్రేజ్ ను సొమ్ము చేసుకోవాలనుకోవటం తప్పు లేదని.. అందుకు మొదటి రోజు వరకూ ధర పెంచటం కొంత మేర ఫర్లేదు కానీ.. ఇలా రెండు వారాల పాటు ధరల్ని పెంచటం ఇదేం పద్ధతి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ కొత్త ధోరణిని స్వాగతించిన పక్షంలో.. ఇదో అలవాటుగా మారి ప్రతి పెద్ద సినిమాకు టికెట్ల ధరల్ని భారీగా పెంచేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. టికెట్ల ధరలు పెంచే ధోరణికి చెక్ పెట్టేలా ఆన్ లైన్ ఉద్యమం కానీ స్టార్ట్ అయితే.. ఇప్పుడున్న సోషల్ చైతన్యం మహర్షి మూవీకి షాకివ్వటం ఖాయమంటున్నారు. టికెట్ల ధర పెంపు ద్వారా డబ్బులు రాబట్టుకోవాలనుకోవటం మంచిదే కానీ.. అభిమానాన్ని దోచుకోవాలన్న ధోరణి కనిపించకూడదంటున్నారు. ఈ ప్రచారం జోరందుకుంటే మొదటికే మోసం ఖాయమంటున్నారు.